◆ఆరోగ్య స్పృహ పెరిగే కొద్దీ తిండి అలవాట్లు కూడా మారిపోతూ ఉన్నాయి. ఆరోగ్యం కోసం అందరూ ఆచరిస్తున్న కొత్త పద్దతి మొలకలు తీసుకోవడం. మొలకల్లో ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉండటం వల్ల అల్పాహారం స్థానంలో మొలకలు తీసుకుని ఆరోగ్యమే మాహాభాగ్యం అంటున్నారు.
◆మొలకలు ఎలా అభివృద్ధి చేయాలి అని చాలా మందిలో సందేహం. మనం ఎంచుకున్న విత్తనాలను దాదాపు రెండు నుండి పన్నెండు గంటలపాటు నీళ్లలో నానబెట్టడం వల్ల అవి పునరుత్పత్తికి సన్నద్ధం అవుతాయి అయితే వాటిని పలుచని వస్త్రం లో వేసి గట్టిగా మూట కట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచడం వల్ల మూడు నుండి నాలుగు రోజుల్లో రెండు నుండి ఐదు సెంటిమీటర్ల మేర మొలకలు పెరుగుతాయి. వేటిని రోజువారీ ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం చిరు తిళ్ళు తీసుకునే సమయంలో తీసుకుంటారు.
◆మొలకల్లో ప్రోటీన్, మెగ్నీషియం, పాస్పరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ కె, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే మొలకల్లో యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.

మొలకలు తీసుకోవడం వల్ల ఉపయోగం
◆మొలకలు పునరుత్పత్తి వ్యవస్థకు సిద్ధంగా ఉంటాయి కాబట్టి వాటిలో ఎంజైములు సజీవంగా ఉంటాయి. అందువల్ల వాటికి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వీటిలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. అందువల్ల జీర్ణాశయం, పేగులు మొదలైనవి శుభ్రపడతాయి. అధికంగా పీచు ఉండటం వల్ల మలబద్దకం సమస్య నివారించబడుతుంది.
◆బరువు తగ్గాలి అనుకునేవారికి మొలకలు గొప్పగా పని చేస్తాయి. వీటిలో ఫైబర్ వల్ల కడుపు భాగంలో పేరుకున్న కొవ్వులు కరిగిపోతూ బరువును తగ్గిస్తాయి. అలాగే అధికంగా ఉన్న ఫైబర్ వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావనను అలాగే ఉంచగలుగుతాయి.. అలాగే మొలకల్లో ఎటువంటి ఫ్యాట్ లు ఉండకపోవడం వల్ల కొవ్వులు పెంచవు.
◆గుండె ఆరోగ్యమే శరీర ఆరోగ్యమని వేరే చెప్పాలా. అలాంటి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో మొలకలు ఎంతో బాగా సహాయపడతాయి. శరీరంలో ఉన్న కొవ్వులలో మంచి కొవ్వులను గుండెకు అందించి చెడు కొవ్వులను విచ్చిన్నం చేస్తాయి. అందుకే గుండె సమస్యలు ఉన్నవారు మొలకలను తరచుగా తీసుకోవడం మంచిది.
◆ఏమి తింటే శరీరంలో చెక్కరలు పెరిగిపోతున్నాయో అని భయపడుతుంటారు షుగర్ ఉన్న పేషెంట్ లు. అయితే మొలకలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అమైలేజ్ ఎంజైమ్ యొక్క పనితీరును నియంత్రిస్థాయి. ఈ ఎంజైమ్ లు శరీరంలో చెక్కెరలను కరిగించి జీర్ణం చేసి చెక్కర స్థాయిలను క్రమబద్దీకరించంలో తోడ్పడతాయి.
◆మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరం అయ్యే తెల్లరక్తకణాల అభివృద్ధికి విటమిన్ సి ఎంతగానో తోడ్పడుతుంది. అలాంటి విటమిన్ సి మొలకల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకే మొలకలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకున్నట్టే.
◆మన శరీరంలో ph సామర్త్యాన్ని క్రమబద్దీకరించి వాటి అసమతుల్యతను నియంత్రించడంలో మొలకల పాత్ర ఎంతగానో ఉంటుందని చెప్పవచ్చు. అంటే మొలకలు తీసుకోవడం వల్ల శరీరంలో ph సమతాస్థితిలో ఉంటుంది.
చివరగా…..
ఇన్ని లాభాలు తెచ్చి పెట్టె మొలకలతో ఒక సమస్య కూడా ఉందన్న విషయం చాలామందికి తెలియదు. సాల్మొనెల్లా,ఇకొలి వంటి హానికరమైన బాక్ట్రిరియా మొలకల్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బాక్ట్రిరియ ఎక్కువగా తడి మరియు వెచ్చని ప్రదేశాల్లో వృద్ధి అవుతుంది. అందుకే మొలకలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బాక్ట్రిరియా మన శరీరంలోకి వెళ్తే పన్నెండు నుండి డెబ్భై రెండు గంటల్లోపు అంటే మూడు రోజుల్లోపు జీర్ణవ్యవస్థను దెబ్బ తీసి అది ఫుడ్ పాయిజన్ గా మారె అవకాశం ఉంటుంది. అందుకే మొలకలతో ఆరోగ్యమే కాదు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం కూడా పొంచి ఉందనే విషయం మర్చిపోకండి.
Very useful article