Amazing Health Benefits of garlic in our life

వీటిని రోజు ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్యం ఆమడ దూరంలో ఉంటుంది!!

వెల్లుల్లి లేని వంట అంత రుచిగా ఉండదు అని మనకందరికీ తెలిసినదే. వెల్లుల్లినీ క్రమం తప్పకుండా ఆహారంలో గాని లేదా పచ్చిగా వాడేవారికి అసలు చాలా వరకు డాక్టర్ని కలవాల్సిన అవసరం కలుగదు. ఉదయాన్నే లేవగానే పరగడుపున (అంటే మొహం  కడుక్కున్నాక ) నాలుగు పచ్చి వెల్లుల్లి రెబ్బలు నమిలితే గుండె జబ్బులు దూరం అయిపోతాయి. వెల్లుల్లిలో పలు రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. గుండె కండరాలను దృఢ పరిచి రక్తాన్ని శుద్ది చేస్తుంది

◆వెల్లుల్లి యాంటీ డయాబెటిక్ గా కూడా పనిచేస్తుంది.

మధుమేహం ఉన్న వారికి వరప్రదాయని అని చెప్పవచ్చు. వెల్లుల్లి ఎక్కువగా వాడడం వల్ల గొంతుకు నోటికి సంబంధించిన రుగ్మతలు దరి చేరనివ్వదు

వెల్లుల్లిలో హైడ్రోజన్ సల్ఫేట్, నైట్రిక్ యాసిడ్ లు రక్తనాళాలు లోపల నుండి రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది.  

◆పచ్చివెల్లుల్లి రసం  దద్దుర్లు మరియు కీటక కాటు వలన ఏర్పడిన దురదను తగ్గించడానికి ఆస్త్మా, శ్వాస కోశ వ్యాధులకు వెల్లుల్లి ఘాటుగా ఉండడం వల్ల బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి ఇన్సులిన్ పెంచుతుంది మధుమేహగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయి నిరోధిస్తుంది. వెల్లుల్లి గుజ్జును లేదా వెల్లుల్లిని ఉడికించిన నీటినీ మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మొటిమలు మచ్చలతో సహా మటుమాయం అవుతాయి.

◆ వెల్లుల్లి పచ్చివి తిన్నా, వండినవి తిన్నా కేన్సర్‌ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకూ నిర్మూలిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వెల్లుల్లి సర్వరోగనివారిణి అనే అనవచ్చు జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఫెర్రోపోర్టిన్ మరియు ఇనుము జీవక్రియ మెరుగుపరచడానికి వెల్లుల్లి ఉపయోగ పడుతుంది. 

◆వీటిని సమృద్ధిగా తీసుకునే మగవాళ్ళలో వీర్యవృద్ధిని కలిగిస్తుంది. వెల్లుల్లిలో థయామిన్‌ లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కళంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్‌ ‘సి’ అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది.

◆వెల్లుల్లి మన శరీరంలో ఏర్పడే కొవ్వు కణాలు నియంత్రించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా గజ్జి, తామర మొదలైన వాటికి కూడా వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. పచ్చి వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి  ఆ భాగాల్లో పై పూతగా పూస్తే మంచి ఉపశమనం ఉండి, సత్వర నివారణ కలుగుతుంది. 

చివరగా….

వెల్లుల్లి సర్వరోగనివారిణి అని మనకు అర్థమైపోయింది. ప్రతిరోజు ఆహారంలో ఎదో ఒక రూపములో వీటిని జతచేసుకోవడం వల్ల గొప్ప ఆరోగ్యం జీవితమంత సంతోషం.  

Leave a Comment

error: Content is protected !!