జామ ఆకుల ‘టీ’ ఉపయోగాలేంటో తెలుసా?

హలో ఫ్రెండ్స్ ..ఈ రోజు మనము జామ చెట్టు యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.. జామ చెట్టు మనకు పల్లెటూర్లలో , మన పెరట్లో కనిపిస్తూ ఉంటాయి. జామకాయలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు అంతే కాదు యాపిల్ కు ప్రత్యామ్నాయంగా ఈ జామకాయలు అని చెబుతూ ఉంటారు. ఈ జామ చెట్టు జామకాయలను ఇవ్వడమే కాకుండా ఎన్నో ఔషధగుణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ ఆకులో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అసలు వదలరు.

జామ ఆకుల లో గల ఔషధ గుణాలు

ప్రతి చిన్న సమస్యకి మనము మందులు వేసుకోకుండా ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలను మనకు అందించింది. డెంగ్యూ అనగానే మనము చాలా భయపడుతుంటారు ఎందుకంటే ఇది వచ్చిందంటే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి జామ ఆకులు ఎంతగానో సహకరిస్తాయి. 9 జామ ఆకులను తీసుకొని మూడు కప్పుల నీటిలో వేసి మరిగించి అవి ఒక కప్పు నీరు అయ్యాక దించి చల్లారాక ఆ నీటిని డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఇస్తే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇలా రోజుకి మూడు కప్పులు ఇవ్వాలి. జామ ఆకులతో టీ తయారుచేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

జామ ఆకు కూర తయారీ విధానం

8 -10 జామ ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక లీటరు నీటిలో వేసి బాగా మరిగించండి. తర్వాత ఆకులను తీసి వేసి ఆ నీటిని వడ కొట్టుకుంటే సరి. ఇలా మరిగించిన టీ తాగలేకపోతే రుచికి కొద్దిగా తేనెను కలుపుకుని తాగితే చాలా మంచిది. ఈ టీలో  యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. జామ ఆకుల టీ తాగడం వలన షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. టైప్-2 డయాబెటిస్ ని సైతం తగ్గిస్తుందని చాలా పరిశోధనల్లో తేలింది.

ప్రస్తుత కాలంలో నిద్రలేమి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావడం, పని ఒత్తిడి వల్ల చాలా అలసటకు గురి అవుతున్నారు. దీని ద్వారా నిద్రలేమి అనుభవిస్తున్నాం. రాత్రి సరిగా నిద్ర పట్టని వారు ఈ జామ ఆకులతో టీ తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఇది మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ ను సక్రమంగా అందించి మెదడు సక్రమంగా పని చేసేటట్లు చేస్తుంది.

జామ ఆకుల టీ వల్ల మతిమరుపు సమస్య తగ్గుతుంది. జామ ఆకుల టీ మూడు నెలలు తాగితే మన శరీరంలో ఉన్న అధిక కొవ్వు కరిగిపోయి ఎన్నో రకాల వ్యాధుల నుండి మనల్ని బయటపడేస్తుంది. మలబద్ధక సమస్యతో బాధపడేవారు జమ ఆకులను టీ  చేసుకొని తాగడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. విరేచనము సక్రమంగా జరుగుతుంది.

డయేరియా వ్యాధి తో బాధపడేవారు ఈ టీ తాగడం ద్వారా త్వరగా కోలుకుంటారు. అజీర్తి కే కాదు ఆకలి లేమి కూడా ఈ టీ  చక్కగా పనిచేస్తుంది. రెండు జామ ఆకులను నోటిలో పెట్టుకొని నమిలి రసాన్ని కొద్దిసేపు  నోట్లో పెట్టుకొని ఉసివేస్తే ఆకలి చక్కగా అవుతుంది. జామ ఆకుల టీ తాగడం వల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది.

జామాకులు తినేవారికి దెబ్బ తలిగిన గాయమైన ఆ గాయాలు తొందరగా మానిపోతాయి. చాలా లావుగా ఉన్నా, బరువు తగ్గాలనుకుంటే ఈ జామాకుల టీ చాలా బాగా పనిచేస్తుంది. మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించి మన శరీర ఆకృతి మంచి షేప్ లోకి రావడానికి ఈ జామ కషాయం బాగా ఉపయోగపడుతుంది.

జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ కషాయం తాగడం వల్ల త్వరగా వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ డికాషన్లో విటమిన్ సి ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. అవి ఈ జలుబు దగ్గును  తొందరగా తగ్గేలా చేస్తాయి. ఈ  టీ తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరిగి తొందరగా ఏ రోగాల బారిన పడకుండా చేస్తుంది. ఈ జామ ఆకుల టీ ఈ రోజు ఉదయాన్నే తీసుకోవడం ద్వారా మగవారిలో వీర్యవృద్ధి జరుగుతుంది. ఆకులను మెత్తగా పేస్ట్ లా చేసి ఆ పేస్టు మన దంతాలు తోముతూ ఉంటె దంత సమస్య పోవటమే కాకుండా భవిష్యత్తులో ఎటువంటి దంత సమస్యలు రావు. ఇలాంటి మరిన్ని ఆరోగ్య కరమైన విషయాలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.

Leave a Comment

error: Content is protected !!