Amazing Health Benefits Of Nutmeg Jajikaya

అన్ని రకాల నొప్పులను రాత్రికి రాత్రే నయం చేసే చిట్కా

పోషకాహార లోపం, శరీరానికి తగినంత వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చోవడం, కండరాలకు తగిన విశ్రాంతి లభించక పోవడం వంటివి ప్రతి ఒక్కరిలోనూ మెడ, నడుము, వెన్ను, కాళ్ల నొప్పులకు కారణం అవుతుంది. వీటిని తగ్గించుకోవడానికి మంచి ఆహారపు అలవాట్లతో పాటు కనీసం వ్యాయామం చేయడం కూడా అవసరమే. అలాగే కొన్ని ఆహార పదార్థాలు శరీరంలోని నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందులో ముఖ్యంగా జాజికాయ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. 

అంతేకాకుండా  ఒక శక్తివంతమైన కామోద్దీపన, జీర్ణ ఉద్దీపన, ముఖ్యంగా తలనొప్పికి సంబంధించిన నొప్పిని తగ్గించడం మరియు సాధారణ జలుబు, దగ్గు మరియు ఉబ్బసం వంటి వాటికి చికిత్స చేస్తుంది. నొప్పులు తగ్గడానికి జాజికాయను ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఒక మందపాటి గిన్నెలో ఒక నాలుగు స్పూన్ల ఆవ నూనె వేసుకోవాలి. ఆవనూనె నొప్పులను తగ్గించడానికి, రక్త ప్రసరణ మెరుగుపరచడానికి శరీరంలో వేడిని కలిగిస్తుంది.

తర్వాత నాలుగు స్పూన్ల ఆముదం వేసుకోవాలి. ఆముదం కూడా నొప్పుల నుండి ఉపశమనం ఇవ్వడానికి ప్రభావంతంగా పనిచేస్తుంది.  ఒక స్పూన్ జాజికాయ పొడి వేసుకోవాలి. నూనె కొంచెం మరిగిన తరువాత వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకొని ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల నొప్పి తగ్గడంతో పాటు కండరాలు ఉపశమనం పొందుతాయి.

 ఇంకొక చిట్కా కోసం ఒక గ్లాసు నీళ్లు వేసి అందులో రాత్రి నానబెట్టుకున్న మెంతులు ఒక స్పూన్ వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఒక పావు స్పూన్ మిరియాలపొడి కూడా వేసుకోవాలి. తరువాత నీటిని బాగా మరిగించి వడగట్టుకుని తాగడం వల్ల శరీరంలో పట్టేసిన కండరాలు ఉపశమనం పొందుతాయి. నొప్పులు వాపులు తగ్గించడంలో కూడా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!