Amazing Health Benefits of Papaya

బొప్పాయి తినే అబ్బాయిలు జాగ్రత్త. ఎందుకో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి

బొప్పాయి పండు సంవత్సరమంతా మనకు అందుబాటులో ఉంటుంది. మనదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో బొప్పాయి పంట ఎక్కువగా పండుతుంది. డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవడం సాధారణం. అయితే బొప్పాయి పండు, ఆకులు ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చేస్తాయి అని తెలిసిన తరువాత ఈ ముక్కలకు డిమాండ్ పెరిగింది. ఈ ఆకులను నీటిలో మరిగించి లేదా మిక్సీ పట్టి రసం తీసుకుని తాగడం వలన ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. 

అలాగే బొప్పాయిపండును తరచూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. బొప్పాయిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, జీర్ణక్రియలో సహాయపడటం, మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరచడం, రక్తపోటును తగ్గించడం మరియు గాయం నయం చేయడం వంటివి ఉన్నాయి. 

అయితే బొప్పాయిని ఎక్కువగా తీసుకోకూడదు. ఒక పెద్ద బొప్పాయిముక్క తీసుకుంటే సరిపోతుంది. అలాగే కొంతమంది బొప్పాయి ఎక్కువగా తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు హానికరం కావచ్చు. బొప్పాయికి వేడి చేసే గుణం ఉంటుంది. ఇది గర్భస్రావానికి కారణం అయ్యే అవకాశం ఉంది.

 జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం వలన ఇది గ్యాస్ వంటి సమస్యలకు అజీర్ణానికి కారణమవుతుంది.

 మందులతో సరిగా ఉండకపోవచ్చు. మందులు తీసుకున్నప్పుడు బొప్పాయి తినడం వలన ఇది ఎలర్జీ కలిగించే అవకాశం ఉంది లేదా మందుల ప్రభావం సరిగ్గా పనిచేయకపోవచ్చు.

 రక్తంలో చక్కెరను గణనీయంగా తగ్గిస్తుంది. బొప్పాయి కి రక్తంలో చక్కెరను నియంత్రించే గుణం ఉంటుంది. బొప్పాయి ఎక్కువగా తీసుకోవడం వలన ఇది చక్కెర లెవల్స్ ను బాగా తగ్గించే అవకాశం ఉంది. ఇది లో షుగర్ కు కారణం అవుతుంది.

 ఇతర అలెర్జీలకు కారణం కావచ్చు. కొంతమందికి బొప్పాయి చర్మంపై దద్దుర్లు, దురదలు మరియు శ్వాసకోశ రుగ్మతలకు కారణం కావచ్చు. అందుకే బొప్పాయి తినే ముందు వీటిని గుర్తు పెట్టుకొని తీసుకోవడం మంచిది. 

అలాగే కొన్ని ప్రయోజనాల కోసం తీసుకొనే బొప్పాయి విత్తన సారం సంతానోత్పత్తికి కీలకమైన స్పెర్మ్ చలనశీలతలను గణనీయంగా మరియు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అందువలన, పురుషులు బొప్పాయి మరియు బొప్పాయి విత్తనాలు అధిక మొత్తంలో తీసుకోకుండా ఉండటం మంచిది.

Leave a Comment

error: Content is protected !!