చిన్నతనమంతా తోటల చుట్టూ చేల చుట్టూ గడిచింది అదంతా మధురమైన జ్ఞాపకాల కలబోత. అదే బాల్యంలో అడ్డు అదుపు లేకుండా అవురావురుమంటూ తిన్న మామిడి పళ్లు, జామపళ్ళు, చింత కాయలు, బొప్పాయి కాయలు అబ్బో ఈ వరుస తెగేదేనా….. కానీ అవన్నీ ఇపుడు ఖరీదు పరంగా ఆకాశాన్ని తాకుతున్నాయ్. అడపా దడపా తింటున్న పండ్లలో బొప్పాయ కూడా ఒకటి. బాగా పండిన పండును తొక్క తీసి కొస్తే అందులో విత్తనాలు ఒక అద్బుతంలాగే కనిపించేవి. ఇక రుచి గూర్చి వర్ణించలేము కూడా. చిన్నప్పుడు సరదాగా తిన్నా… ఇప్పుడు అరుదుగా తింటున్నా బొప్పాయిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక వారం వారం కుదిరితే రెండు రోజులకు ఒకసారి అయినా తినేయాలనిపిస్తుంది. ఇంతకు బొప్పాయిలో ఏముంది.
◆బొప్పాయిలో విటమిన్- ఎ, కె, ఈ, సియూ పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్- బి కోవకు చెందిన బి1, బి2, బి3, బి5 మరియు బి9 లతో నిండి ఉంటుంది. అలాగే బొప్పాయిలో బయోఫ్లవనాయిడ్స్ మరియు ఫైబర్ లు మెండుగా ఉంటాయి.
◆పాస్పరస్, పొటాషియం, ఇనుము, రాగి మంగనీస్, మెగ్నీషియం మరియు కాల్షియం ఖనిజాలు బొప్పాయిలో పుష్కలంగా లభిస్తాయి.
◆బొప్పాయిలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది పెద్ద పేగులలోని విషాన్ని గ్రహించి నిర్వీర్యం చేస్తుంది.
◆బొప్పాయిలో ఉన్న విటమిన్- సి మన శరీరానికి తగిలిన దెబ్బలు మాన్పడంలో చాలా బాగా తోడ్పడుతుంది. అలాగే కాన్సర్ కణాలను నిర్వీర్యం చేసి కాన్సర్ ప్రమాదాన్ని దూరంగా ఉంచుతుంది. మన శరీరంలో రోగనిరోదక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

◆బొప్పాయిలో ఆంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఎండిన బొప్పాయి మన శరీరానికి కావలసిన ఇమ్యూనిటీ ని పెంచుతుంది.
◆మన శరీరానికి అవసరమైన బీటా కెరోటిన్ క్యారేట్ లో కంటే బొప్పాయిలో అధికంగా లభిస్తుంది.
◆బొప్పాయిలోని బయోఫ్లోవానాయిడ్స్ శరీరంలో వ్యాధులకు కారణమయ్యే వైరస్, కాన్సర్ వంటి కణాలతో పోరాడి ప్రాణాంతకరమైన జబ్బుల నుండి కాపాడుతుంది.
◆గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్-ఎ, విటమిన్-సి లు శరీరంలో మంచి కొవ్వులను కాపాడటంలో సహాయపడుతుంది. ఈ విటమిన్లు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి.
◆బొప్పాయిలోని పిపాన్ అనే ఎంజైము జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా సంరక్షిస్తుంది.
◆శరీరంలో దెబ్బ తిన్న కండరాల వ్యవస్థను పటిష్టం చేసి శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది.
◆ధూమపానం వల్ల బలహీన పడిన ఊపిరితిత్తులను మరియు ఊపిరితీతులకు సంభవించిన వాపులను తగ్గించడంలో బొప్పాయి గొప్పగా పనిచేస్తుంది.
◆మహిళల నెలసరి సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తీసుకోవడం వల్ల నెలసరి క్రమబద్దమవుతుంది.
◆షుగర్ ఉన్నవారికి బొప్పాయి గొప్ప పండని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
◆దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు బొప్పాయిని తీసుకోవడం వల్ల రక్తం వృద్ధి చెంది, అనిమియా సమస్య నుండి బయటపడచ్చు.
◆ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా చర్మసంరక్షణలో మరియు జుట్టు సంరక్షణలో బొప్పాయి బాగా పని చేస్తుంది.
◆చర్మంలో తేమను పెంచుతుంది
◆నల్లబడిన చర్మాన్ని మరియు జీవంలేని కణాలను తొలగిస్తుంది
◆చర్మంపై ముడుతలు తగ్గించి, యవ్వనంగా ఉంచుతుంది.
◆ఇది సహజసిద్ధమైన బిలీచింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది.
◆జుట్టు పొడవు పెరగడానికి తోడ్పడుతుంది
◆బొప్పాయి విత్తనాల పేస్ట్ ను తలకు పెట్టుకోవడం వల్ల చుండ్రు నివారించబడుతుంది
◆బొప్పాయి జుట్టుకు మంచి కండీషనర్ గా పని చేస్తుంది.
◆ఇన్ని లాభాలున్న బొప్పాయిని తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయకండి. కుదిరితే ఒక మొక్కను నాటుకొండి. మీ ఇంట ఆరోగ్య పంట పడినట్టే….