చాలామంది ఆరోగ్యానికి మంచిదని పల్లీలు తింటారు. అసలు వాటి ప్రయోనాలు ఏంటో అవగాహన లేకపోయినా తింటుంటారు. పల్లీల వలన కలిగే ప్రయోజనాల ఏంటో చూసేద్దాం. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పరిశోధనల ప్రకారం పల్లీలు చెడు కొవ్వు ను కరిగించి గుండె నాళాల్లో ఏర్పడే గడ్డలు రక్తప్రసరణ లేకుండా చేస్తాయి.పల్లీలు ఈ గడ్డలను కరిగిస్తాయి. గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తాయి. ఒక గుప్పెడు వేరుశనగలను నానబెట్టి ఉదయాన్నే తింటే ఇందులో ఉండే పోషక విలువలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
పల్లీలలో కేలరీలు అధికంగా ఉంటాయి. కానీ ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫైబర్ కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలిని తగ్గిస్తుంది. త్వరగా ఆకలివేయకపోవడంవలన త్వరగా బరువు తగ్గుతారు. పరగడుపున తింటే బరువుతగ్గడానికి సహాయపడతాయి.
వేరుశనగలను ఆహరంలో భాగం చేసుకోవడంవలన మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయి అదుపుచేస్తాయి. దీనిని తీసుకుంటే ఇందులో పుష్కలంగా ఉండే గ్లైసమిన్ ఇండెక్స్ ఉంటుంది.
దీనిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గిస్తాయి.
రోజూ తీసుకోవడంవలన శరీరంలో కాన్సర్ కణాలను అదుపుచేస్తాయి. ఇందులో ఉండే ఫినొలిక్ యాసిడ్స్, యాంటీ కాన్సర్ ప్రాపర్టీస్ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి శరీరంలో కాన్సర్ పెరగకుండా చేస్తాయి.పల్లీలు తినడంవలన విటమిన్ ఇ, మెగ్నీషియం మరియు జింక్ చర్మంలోనిపేరుకుపోయిన బాక్టీరియా ను తొలగించి మీ చర్మానికి గ్లో వచ్చేలా చేస్తుంది.
జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఎమినోయాసిడ్స్, ప్రొటీన్లు మీ వెంట్రుకలకు సహజమైన పోషకంలా పనిచేసి జుట్టు ఆరోగ్యం గా బలంగా పెరిగేలా చేస్తుంది.
అలసట, ఒత్తిడి తగ్గిస్తుంది. శరీరంలో సెరటోనిన్ లెవల్ తగ్గడంవలన అలసట, డిప్రెషన్, ఒత్తిడి అనిపిస్తుంది. వేరుశనగలలో ఉండే పోషకాలు శరీరంలో సెరటోనిన్ పెరగడానికి సహాయపడతాయి. డిప్రెషన్లో ఉంటే రోజూ అల్పాహారం తర్వాత ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్ తినాలి. పిల్లల్లో జ్ఞాపకశక్తి ని పెంచుతుంది. మెదడు పనితీరును పెంచి పిల్లలలో మందబుద్ధి ఉన్నవాళ్ళను మెరుగుపరుస్తుంది. రోజు గుప్పెడు పల్లీలను ఇవ్వడంవలన ఉత్సాహంగా ఉంటారు. పెద్దల్లో అల్జీమర్స్ అంటే మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో శక్తిని కూడా పెంచుతుంది. జీడిపప్పు తో సమానమైన పోషకాలు ఉన్న వేరుశనగలను ఆహారంలో భాగంచేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.