నేల గులాబీ, నాచు గులాబీ, గడ్డిగులాబి వంటి పేర్లతో పిలువబడే ఈ మొక్కలను అందరూ ఇంటి ముందు అందం కోసం పెంచుకుంటూ ఉంటారు. చిన్న కొమ్మ గుచ్చితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా పెరిగే ఈ మొక్క రకరకాల రంగుల్లో మంచి అందాన్నిస్తాయి. ఈ మొక్కలు ఆరోగ్య పరంగా మరియు చర్మం, జుట్టు సమస్యలకు కూడా పరిష్కారాలను అందిస్తాయి. ఇప్పటి వరకు వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియకపోతే ఇప్పుడు వీటి గురించి తెలుసుకోండి.
ఈ మొక్కలోని పువ్వులు, ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి ఎన్నో చర్మసమస్యలను పరిష్కరించడంలో సహకరిస్తాయి. దాని కోసం ఈ మొక్కలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట ఈ పువ్వులను, ఆకులను మొక్కలనుండి సేకరించుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మొదట పువ్వులను రోట్లో మెత్తగా దంచి ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయాలి.
వీటిలో ఔషధ గుణాలు చర్మంలోకి ఇంకి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది. ఇలా కనీసం 7 రోజులపాటు చేయడం వల్ల ముఖంపై మచ్చలను తగ్గించుకోవచ్చు. అనేక రకాల జుట్టు సమస్యలు కూడా ఈ మొక్కలు చాలా బాగా పనిచేస్తాయి.
జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి సమస్యలకు ఈ మొక్క ఆకులను ఒక గుప్పెడు తీసుకోవాలి. మధ్య ఉండే కాండాన్ని తీసేసి కేవలం ఆకులను తీసుకోవాలి. తర్వాత ఒక రోట్లో ఈ ఆకులను మెత్తగా దంచి అందులో రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోవాలి. మెత్తగా అయిన తరువాత ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి ఆరిన తరువాత తలస్నానం చేయాలి ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన జుట్టు సమస్యలు నివారించుకోవచ్చు.
ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్లు మరియు ఎ, సి, డి, ఇ మరియు బి 3 వంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులు, పువ్వులు మిశ్రమం టిష్యూ హీలింగ్ మరియు ఫేషియల్ మాస్క్ గా ఉపయోగించడం వలన చర్మంపై కాలిన, కోసుకున్న గాయాలు తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మం యొక్క పీహెచ్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.