చాలా అరుదైన ఫలం రామాఫలం. సీతాఫలం, లక్ష్మణ ఫలం లాగా రామా ఫలం కూడా తినదగ్గ, ఎంతో రుచికరమైన పండు. అరుదుగా లభించే ఈ పండులో అమృత సమానమైన పోషకాలు ఉన్నాయి, శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రోటీన్, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం మొదలైనవి ఉంటాయి. ఇంకా రామాఫలం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూడండి.
మధుమేహాన్ని నయం చేస్తుంది.
రామాఫలం ఆపిల్ లేదా మామిడి వంటి వాటిలా తీపు ఎక్కువ ఉండదు. అంటే ఇందులో మిగిలిన పండ్లతో పోలిస్తే చక్కెర శాతం తక్కువ. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉన్న ఎవరైనా రమాఫలం నిరభ్యరంతంగా తినవచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్ళలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
మొటిమలు తగ్గిస్తుంది
విటమిన్లు, ముఖ్యంగా బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి తో నిండిన రామాఫలం మొటిమలకు ఉత్తమ నివారణ. శరీరారానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించడంలో ఇది దోహాధం చేస్తుంది. అలాగే ఈ పండ్లలో ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది చర్మ కాంతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
చుండ్రు చికిత్స
ఈ పండులో నూనెలు ఉండటం వల్ల జుట్టుకు పోషకాలు అందించడం ద్వారా చుండ్రు నుండి జుట్టును కాపాడుతుంది. కాబట్టి జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఇది నిజంగా సహాయపడుతుంది.
ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్
ఏదో ఒక విధంగా శరీరం లోపల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్కు పొటాషియం దోహాధం చేస్తుంది. అలాంటి పొటాషియం రామాఫలంలో సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు, ఆరోగ్యానికి సహాయపడుతుంది. మరియు విసర్జన ప్రక్రియలో శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నొప్పి నుండి ఉపశమనం
రామాఫలం పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మరోవైపు నాడీవ్యవస్థను ఓదార్చడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి తోడ్పడుతుంది..
బ్యాక్టీరియాతో పోరాడుతుంది
సహజ యాంటీబయాటిక్, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ అని పిలువబడే రామాఫలం. విరేచనాలు, న్యుమోనియా మరియు టైఫాయిడ్లకు ఔషధంగా పనిచేస్తుంది.
హైపర్ పిగ్మెంటేషన్ చికిత్స
హైపర్ పిగ్మెంటేషన్ లేదా శరీర రంగును కొన్ని భాగాలలో నల్లగా ఉండటాన్ని నివారించడానికి రామాఫలం పండ్లను ఉపయోగించవచ్చు. ఇందులోని నూనె గుణాలు హైపర్ పిగ్మెంటేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది కాబట్టి చర్మం సహజంగా మెరుగ్గా ఉంటుంది.
ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది
వీటిలో కాల్షియం మరియు విటమిన్లు ఉంటాయి, ఇవి ఎముక సమస్యలకు, ఎముకల ఆరోగ్యానికి ఉత్తమ మార్గం. ఇంకా, ఇది కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది
జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడంలో ఫైబర్ గొప్పగా పనిచేస్తుంది. కడుపు లోపల జీర్ణం కావడానికి ఇబ్బందిగా ఉన్న పదార్థాలను సులువుగా జీర్ణం చేయడానికి ఫైబర్ దోహాధం చేస్తుంది. అలాగే ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చివరగా……
రామాఫలం తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందులోని యాంటీ ఏజింగ్ గుణాల వల్ల వయసు రీత్యా ఎదురయ్యే వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా చేస్తుంది. అందుకే రామాఫలం దొరికితే అసలు వదలకండి.