అధిక ధర కలిగిన ఒక సౌందర్య సాధనం, మరియు మసాలా దినుసుగా ఉలయోగించబడే కుంకుమపువ్వు ఎంతో ప్రసిద్ధి చెందినది. ఆధునిక పరిశోధన ప్రకారం కుంకుమపువ్వును కామోద్దీపన కలిగించడానికి, చెమటను పుట్టించడానికి మరియు మెన్సురేషన్ తీసుకురావడానికి ఉపయోగించవచ్చు. అయితే కుంకుమపువ్వు వల్ల మరికొన్ని ఇతర ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూడండి.
క్యాన్సర్ నుండి రక్షిస్తుంది
కుంకుమపువ్వులో క్రోసిన్ అని పిలువబడే ముదురు నారింజ, నీటిలో కరిగే కెరోటిన్ ఉంటుంది, ఇది కుంకుమ బంగారు రంగులో ఎక్కువ భాగం ఉంటుంది. క్రోసిన్ అనేక రకాల క్యాన్సర్ కణాలు, లుకేమియా, అండాశయ కార్సినోమా, పెద్దప్రేగు అడెనోకార్సినోమా మరియు మృదు కణజాల సార్కోమాను ప్రేరేపిస్తుంది. కుంకుమ పువ్వులోని సారం ప్రాణాంతక వ్యాధులను కలిగించే కణాలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. క్యాన్సర్ కణాలను నిరోధించడమే కాక, సాధారణ కణాలపై అలాంటి ప్రభావం దరిచేరకుండా ముందుజాగ్రత్త వహిస్తుంది. రోగనిరోధక శక్తిని కలిగి ఉన్న లింపోసైట్లను ప్రేరేపిస్తుంది.
జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
కుంకుమపువ్వులోని సారం, ప్రత్యేకంగా అందులోని క్రోసిన్, వయస్సు సంబంధిత మానసిక బలహీనత చికిత్సలో ఉపయోగపడుతుంది. కుంకుమ పువ్వును పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది మెదడు పై ఒత్తిడిని తగ్గించి మెదడు నరాలకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. తద్వారా మానసిక సమస్యలను నిర్మూలిస్తుంది.
యుక్తవయస్సు సమస్యలను పరిష్కరిస్తుంది
ఎదిగే వయసులో ఉన్న బాలికలు కుంకుమ పువ్వు వాడటం వల్ల ఉద్దీపన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ పాలలో చూర్ణం చేసిన చిటికెడు కుంకుమపువ్వు కలిపి తీసుకోవడం వల్ల హార్మోన్లను ఉత్తేజపరిచేందుకు ఎంతగానో దోహాధం చేస్తుంది.
కాంతివంతంగా ఉంచుతుంది
కుంకుమ పువ్వును పాలలో కలిపి తీసుకోవడం వల్ల గర్భవతులలో పుట్టబోయే శిశువు మంచి రంగులో పుడతారనే విషయం అందరికి తెలిసినదే. అయితే కాంతివంతమైన చర్మం కోసం సాధారణ వ్యక్తులు కూడా దీన్ని ఉపయోగించవచ్చు.
జుట్టు పెరుగుదలకు దోహాధం చేస్తుంది
దీన్ని ప్రతిరోజు పాలలో కలిపి తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.
మద్యపానానికి చెక్ పెడుతుంది
చాలామంది మద్యపానానికి వ్యసనపరులుగా మారినప్పుడు ఆ వ్యసనాన్ని నిర్మూలించడానికి కుంకుమపువ్వు దోహాధం చేస్తుంది. కుంకుమపువ్వు కలిపిన పాలను మద్యపానం సేవించిన వారితో తాగించచడం వల్ల మద్యపానాన్ని నెమ్మదిగా తగ్గిస్తారు.
ఆహారానికి రుచిని ఇస్తుంది
చాలా వంటకాలలో ముఖ్యంగా బిర్యానిలలో కుంకుమపువ్వు తప్పనిసరిగా వాడటం జరుగుతుంది. ఇది ఆహారానికి గొప్ప రుచిని చేకూరుస్తుంది. అలాగే తీపి వంటలు, తాంబూలాలు, పానీయాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
సహజమైన రంగును ఇస్తుంది
కుంకుమపువ్వు పాలలో కలిపితే పాలు పసుపు రంగుకు మారడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా మసాలా వంటకమైన బిర్యానికి పైన కుంకుమపువ్వు కలిపిన పాలను వేసినప్పుడు బిర్యానీ పసుపురంగులోకి మారడం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇది సహజమైన రంగును కలిగి ఉంటుంది.
చివరగా……….
ప్రపంచంలో అధిక ధర కలిగిన మసాలా దినుసు మరియు సౌందర్య సాధనం అయిన కుంకుమపువ్వు ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. ఎందుకంటే నకిలీ ఉత్పత్తులు వెల్లువలా ఉంటాయి వీటిలో ఉత్తమమైనది ఎంపిక చేసుకుని మంచి ఫలితాలను తప్పక పొందండి.