Amazing Health Benefits of Sweet Corn Telugu

మొక్కజొన్న ఆరోగ్యానికి వెన్న లాంటి పోషకాలను అందిస్తుంది!!

సన్నగా చినుకులు పడుతూ ఉంటే మొక్కజొన్న కండె ను నిప్పుల మీద వేడి వేడి గా కాల్చుకుని కమ్మగా తింటే ఆ మజా నే వేరబ్బా, భలే బావుంటుంది. కేవలం అలా ఆస్వాదించడానికే కాదు మొక్కజొన్న తింటే కలిగే ప్రయోజనాలు బోలెడున్నాయ్ అవేంటో చూడండి.

◆మెుక్కజొన్న గురించి తెలియని వారు ఉండరు. మెుక్కజొన్న విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను పచ్చిగా కాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. ఇవి బాగా లేతగా చిన్నగా ఉన్నప్పుడు బేబీ కార్న్ కూర కూడా చేసుకుంటారు మెుక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. పాప్ కార్న్ గురించి అసలు తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేస్తారు మొక్కజొన్న పిండిని స్నాక్స్ లో వాడతారు

మెుక్కజొన్న విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం.  ఇది చాలా బలమైన ఆహారపదార్ధం. ఇంతేకాకుండా మొక్కజొన్న వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

◆మెుక్కజొన్నలో అనేక విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉంటే అది మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ అరికడుతుంది. 

◆ఎముకల బలానికి పోషకాలైన  కాపర్ ఐరన్ ఇంకా అవసరమైన లవణాలు, మినరల్స్ అన్ని మెుక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. 

◆మెుక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచి శరీరంపై ముడతలు లేకుండా చేసి ఎప్పటికి చిన్నవారుగా కనపడేలా చేస్తాయి. మొక్కజొన్న లో నుంచి తీసిన నూనె చర్మ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

రక్తహీనత ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన వరం అని చెప్పొచ్చు. మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాల వృద్ధిని కలగజేస్తుంది. మొక్కజొన్న రక్తకణాల్లో కొలెస్ట్రాల్ ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు పక్షవాతం బీపీ మొదలైన వాటి సమస్యలు అదుపులో ఉంటాయి.

◆ మెుక్కజొన్నను ప్రతిరోజు తినడం వలన జుట్టుకు బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల జుట్టు స్మూత్‌గా, మంచి షైనింగ్‌గా  మంచి మెరుపుతో సిల్కీగా ఉంటుంది. మొక్కజొన్న తినడం వల్ల శరీరంలో ఉండే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఇందులో ఉండే ఖనిజాలు పోషకాల శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది.

చివరిగా…. 

మొక్కజొన్న తినడం వల్ల హైపర్టెన్షన్ కూడా దూరం అవుతుంది. బీపీ షుగర్ గుండె జబ్బులు అన్నిటికీ సరైన ఆహారం మొక్కజొన్న. అందుకే మీరు కూడా మొక్కజొన్నను మీ ఆహారంలో భాగం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి.

Leave a Comment

error: Content is protected !!