Amazing Health Benefits of Tippateega Giloy

సకల రోగాలను నేల కూల్చేద్దాం

పల్లెల్లో పట్టణాల్లో విరివిగా పెరిగే మొక్క తిప్పతీగ. మన శరీరంలో ఎన్నో రోగాలకు కారణమయ్యే వాత, పిత్త, కఫ దోషాలను తొలగించడానికి ఎంతో అద్భుతంగా పనిచేసే గొప్ప ఔషధం. దీనిని అమృతలత అని కూడా అంటారు. దీనిని ఎన్ని ముక్కలుగా నరికినా ఇది మరణించదు అందుకే దీన్ని అమృతవల్లి, అమృతసంభవ, రసాయని, బిషక్ ప్రియ అని ఇలా వివిధ పేర్లతో సంబోధిస్తారు. 

తిప్పతీగ లక్షణం

తిప్పతీగ చేదు, వగరు రుచులు కలిగి ఉష్ణశక్తి ని నింపుకుని ఉంటుంది. ఇది ఎన్నో జబ్బులకు ఔషధంగా పనిచేస్తుంది. వాటిలో కొన్ని మీకోసం.

వాతరక్తవ్యాధికి.

వాతాన్ని మనం గ్యాస్ అని పిలుచుకుంటాము. మన శరీరంలో పెరిగిపోయిన గ్యాస్ రక్తంలో చేరి శరీరమంతటా ముఖ్యంగా అవయవాల సందుల్లో చేరి నొప్పులు, వాపులు, పోట్లు కలుగజేస్తుంటాయి. అలాంటి సమయంలో తిప్పతీగను దంచి ముద్దచేసి ఆ ముద్దకు నాలుగు రెట్ల నీళ్లు కలిపి కేవలం పావు వంతు నీళ్లు మిగిలేలా కషాయం తయారు చేసి దాన్ని వడగట్టుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో ఔన్స్ మోతాదుగా తాగాలి. దీనివల్ల వాతరక్తవ్యాధి మటుమాయం అవుతుంది.

Hemorrhoids

ఫైల్స్( మొలలు) వ్యాధికి.

తిప్పతీగను ముద్దగా నూరి రసం తీసి ఆ రసాన్ని ఔన్స్ మోతాదుగా  మజ్జిగలో కలిపి కొంచం వేడి చేసి తాగుతూ ఉంటే అన్నిరకాల ఫైల్స్ వ్యాధులు పరిష్కారమవుతాయి

అతివేడి శరీరానికి.

కొందరి శరీరం ఎలాంటి వేడి పదార్థాలు తీసుకోకపోయినా ముట్టుకున్నపుడు వేడిగా అనిపించకపోయినా శరీరంలో అగ్నిగోళంగా ఉన్నట్టు ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వాళ్ళు తిప్పతీగ ను దంచి రసం తీసి దాన్ని 30 గ్రాములు ప్రతీరోజు ఉదయాన్నే తాగుతూ ఉంటే వేడి తగ్గుతుంది అంతే కాదు వ్యాధినిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.

Fever

జ్వరానికి

జ్వరం అనేది సాధారణంగా అందరికి వచ్చే జబ్బు కానీ అందరూ దానికి వందలు, వేలు ఖర్చుపెడుతుంటారు. అయితే తిప్పతీగతో దాన్ని సులువుగా నయం చేసుకోవచ్చు. తిప్పతీగ చూర్ణం ను తేనె తో కలిపి తీసుకోవడం వల్ల జ్వరం తగ్గిపోవడం మాత్రమే కాకుండా జ్వరం వల్ల నీరసించిన శరీరానికి బలం కూడా చేకూరుతుంది.

పుండ్లకు

తిప్పతీగ, పసుపు రెండు సమానంగా తీసుకుని వాటిని బాగా నూరి శరీరం పై ఉన్న పుండ్లకు లేపనంలాగా వేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి మొండి పుండ్లు అయినా మూడు రోజులలో తగ్గిపోతాయి.

క్షయ నివారణకు

తిప్పతీగ మొలిచిన చోట భూమిలోపల దుంప పెరుగుతుంది. ఆ దుంపను సేకరించి ఎండబెట్టి దాన్ని దంచి మెత్తని చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని పూటకు ఆరు గ్రాముల చెప్పున రెండు పూటలా వేడి నీళ్లతో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా భయంకరమైన క్షయ వ్యాధి కూడా నయమైపోతుంది.

చివరగా…….

తిప్పతీగను మనం ఎలాంటి డబ్బు వెచ్చించి కొనాల్సిన అవసరం లేదు. అది దారులకు ఇరువైపులా పుష్కలంగా పెరుగుతుంది. కనీసం ఫోటో చూసి అయినా మనం గుర్తించవచ్చు. దాన్ని సేకరించి చూర్ణం చేసి నిల్వ చేసుకుని ఎపుడూ కావాలంటే అపుడు వాడుకోవచ్చు. అమృత సమానమైన మన తిప్పతీగతో మన జీవితం బాగు బాగు.

Leave a Comment

error: Content is protected !!