Amazing Health Benefits of Using Clay Water Pot

మట్టి కుండలో నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇపుడే తాగడం మొదలు పెడతారు.

పేదోడి ఫ్రిజ్ అనగానే చాలామందికి బల్బ్ వెలుగుతుంది అదేంటో సులువుగా చెప్పేస్తారు. నిజానికి డబ్బున్న వాళ్ళు చల్ల చల్లని నీళ్లను ఫ్రిజ్జుల్లో నుండి తీసుకుని తాగేస్తూ తమకు వేసవి అలసట లేదని అనుకుంటారు. కానీ ఫ్రిజ్ నీళ్లు ఎప్పటికపుడు చల్లదనాన్ని ఇస్తాయేమో కానీ తరువాత శరీరానికి వేడి కలుగజేస్తాయి. అయితే దిగువ తరగతి కుటుంబాల్లో వేసవిలో మట్టి కుండలో నీటిని నిల్వ చేసుకుని తాగడం వేసవిలో సాధారణం. ఒకప్పుడు ప్రతి ఇంట్లో స్థాయి అంటూ తేడా లేకుండా మట్టి కుణ్డస్లు ఉండేవి అందరూ అందులోనే నీళ్లు తాగేవారు. కాలంతో వచ్చిన మార్పు మట్టి కుండలను మూల పెట్టి ఫ్రిజ్జులను తెచ్చిపెట్టాయి. అయితే మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల చల్లదనం మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్ అవేంటో చూడాల్సిందే.  

 సహజంగా చల్లదనాన్ని ఇస్తుంది

 రిఫ్రిజిరేటర్లు లేనప్పుడు ఆ రోజుల్లో మట్టి కుండ నీరు చల్లటి నీటిని అందించేవి. ఇవి బాష్పీభవనం సూత్రంపై పనిచేస్తాయి,  బంకమట్టి  ద్వారా తయారయ్యే ఈ కుండకు సూక్ష్మ రంద్రాలు ఉండటం వల్ల కెజ్నడా లోపల నీటిని చల్లబరుస్తుంది. 

 గొంతుకు మంచిది

 ఫ్రిజ్ నీరు చాలా చల్లగా ఉంటుంది మరియు బయట ఉంచిన నీరు చాలా వెచ్చగా ఉంటుంది, వేసవిలో కుండ సరైన తాగునీటిని అందిస్తుంది.  సంపూర్ణ శీతలీకరణ ప్రభావంతో ఇది గొంతుకు ఎలాంటి హాని కలిగించకుండా శరీర స్థాయికి తగిన విదంగా ఉండేలా నీటిని చల్లబరుస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి కుండా నీరు మంచి ఔషధం.  

 వడదెబ్బ ను నివారిస్తుంది

 వడదెబ్బ అనేది చాలా సాధారణ సమస్య, ఇది వేసవిలో చాలా సహజంగా అందరికి ఎదురవుతుంటుంది. కుండలలో నిల్వ చేసిన నీటిలోని విటమిన్లు మరియు ఖనిజాలు శరీర గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి మరియు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో దోహద పడతాయి. 

 ప్రకృతి సిద్ధంగా నీటిని శుద్దిచేస్తుంది.

 మానవ శరీరం ప్రకృతి సిద్ధమైనది, ఈ శరీరంలో ఎంజైమ్ లు, ఖనిజాలు, లవణాలు, నీరు, మాంసం, రక్తం మొదలైనవి నిండి ఉంటాయి. కుండలలో నిల్వ చేసిన నీరు మన శరీరం యొక్క ఆమ్ల స్వభావంతో స్పందిస్తుంది మరియు సరైన pH సమతుల్యతను నమోదు చేస్తుంది. కుండలో నీరు తాగడం వల్ల ఆమ్లత్వం మరియు కడుపు సమస్యలను తగ్గించడంలో గొప్పగా సహాయ పడుతుంది. 

 జీవక్రియను పెంచుతుంది

 ప్లాస్టిక్ బాటల్ లలో నిల్వ చేసిన నీటిని త్రాగినప్పుడు, ఇందులో బిస్ ఫినాల్ ఎ లేదా బిపిఎ వంటి విష రసాయనాలు ఉంటాయి, ఇవి శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తాయి.  ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది దీన్ని ఎండోక్రైన్ డిస్ట్రప్టర్ అని కూడా అంటారు.  మట్టి కుండలో  నీరు తాగడం టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది మరియు  శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది.

చివరగా…..

మట్టి కుండ అనేది సహజసిద్ధంగా నీటిని చల్లబరుస్తుంది అలాగే ఈ నీటికి రుచి కూడా ఎక్కువ. కాబట్టి తప్పకుండా కుండలో నీళ్లు తాగడం ఇప్పుడే మొదలు పెట్టండి.

Leave a Comment

error: Content is protected !!