amazing health tips with ash gourd

బోలెడు ఆరోగ్యాన్ని చేకూర్చే బూడిద గుమ్మడితో భలే భలే చిట్కాలు

గుమ్మడి, బూడిద గుమ్మడి ఒకప్పుడు మన అమ్మమ్మల కాలంలో, తరువాత అమ్మల కాలంలో కూడా విరివిగా ఉపయోగించుకున్న కూరగాయ. కాలక్రమేణా గుమ్మడి వినియోగం తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతమైతే గుమ్మడి చాలా అరుదుగా వండుతుంటారు. అయితే బూడిద గుమ్మడిని అపుడపుడు వేడుకల్లో హల్వా రూపంలో తప్ప ఇంట్లో వండటం లేదు చాలామంది. ఒకసారి బూడిద గుమ్మడితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఆగలేరు. అవేంటో చూద్దాం మరి.

◆ బూడిద గుమ్మడిలో ఔషధాలు చాలా వున్నాయి. మూత్రంలో మంట, చీము, ఫాస్పెట్స్ అల్బుమిన్ పోతుండటం అరికడుతుంది. స్త్రీల తెల్లబట్ట వ్యాధితో సహా మూత్రాశయ వ్యాధులన్నింటిని తగ్గిస్తుంది.

◆బూడిద గుమ్మడి గింజల్ని వేయించి, మెత్తగా దంచి తగినంత ఉప్పు కారం కలువుకుని నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని ఒక చెంచా పొడిని అన్నంలో వేసుకుని బాగా కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల కడుపులో పాముల్ని నశింపజేస్తుంది. 

◆ అమీబియాస్ తో బాధపడేవారు తప్పని సరిగా బూడిద గుమ్మడిని తీసుకోవాలి. పేగుల లోపల మ్యుకస్  పొర ఏర్పడటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

◆ ఇప్పటికాలంలో చిన్న వయసులోనే షుగర్ వచ్చి లైంగిక సామర్థ్యము తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న వారికి ఇదొక గొప్ప వరం. బూడిద గుమ్మడిని ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే లైంగిక శక్తి పెరుగుతుంది.

◆ మహిళల్లో నెలసరి సమయంలో కనిపించే అధిక ఋతుస్రావాన్ని అరికట్టడానికి ఇది తోడ్పడుతుంది.

◆ సిఫిలిస్ వ్యాధిలో జననాంగం పై పుళ్ళు పడితే, బూడిద గుమ్మడి రసం కానీ లేక బూడిద గుమ్మడి ముక్కలను నీటిలో మరిగించి ఆ ఆవిరిని జననాంగం కు తగిలేలా పడుతూ ఉంటే పుళ్ళు త్వరగా తగ్గిపోతాయి.

◆ బూడిద గుమ్మడిని ఆహారంలో భాగం చేసుకునే వెసులుబాటు లేకపోతే లేక బూడిద గుమ్మడి అందుబాటులో లేకపోతే  ఆయుర్వేద షాపులలో కూష్మాండ లేహ్యం దొరుకుతుంది. దీనిని ఒకటి లేక రెండు చెంచాల లేహ్యన్ని పాలలో కలిపి తీసుకోవచ్చు.

◆ ఇక గుమ్మడి విత్తనాల గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది.

◆ బూడిద గుమ్మడిలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

చివరగా…..

తీగజాతికి చెందిన మొక్కకు కాసే ఈ గుమ్మడి తరచుగా ఆహారంలో తీసుకుంటూ ఉంటే గుమ్మడి కాయంత ఆరోగ్యం  మన సొంతమవుతుంది. మరి మార్కెట్ వెళ్తే గుమ్మడి కొనడం మర్చిపోకండేం.

Leave a Comment

error: Content is protected !!