పేదోడి యాపిల్ గా పిలుచుకునే జామ ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. యాపిల్ కంటే కూడా అధిక మోతాదులో విటమిన్స్ కలిగిన జామను కాలానుగుణంగా తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.
జామలో ఏమున్నాయి??
విటమిన్ ‘ఏ’, విటమిన్ ‘సి’ నిల్వలు జామలో అధికంగా ఉంటాయి.. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరగని కొవ్వు ఆమ్లాలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్ ‘సి’ నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉంటాయి. వీటిలో మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధిక మొత్తాలలో ఉండి తక్కువ కేలరీలలు కలిగి ఉంటాయి. జామపళ్లలో ఉండే కెరటోనాయిడ్లు, పొలీఫెనాల్స్- ఇవి ఆక్షీకరణం కాని సహజరంగు కలిగించే గుణాలు. ఇవి పళ్లకి ఎక్కువ ఆంటి ఆక్సిడెంట్ లక్షణాలను కలుగజేస్తాయి కేవలం జామ పండే కాదు ఆకులలో కూడా అద్భుత విలువలు ఉన్నాయి
జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు, నొప్పి నివారణలో వైద్యంగా వాడతారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. జామ బెరడు ఆంటి మైక్రోబియల్, ఏస్ట్రింజంట్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇన్ని పోషకాలు కలిగిన జామాకు తో కొన్ని అద్భుతమైన చిట్కాలు మీకోసం.
బరువు తగ్గడానికి.
అందరిని అధికబరువు బాధిస్తుంది. అయితే పీచు పదార్థం అదికంగా కలిగిన జామ ఆకు బరువు తగ్గించటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక జామకాయలో 9 గ్రాముల ఫైబర్ కలిగి ఉంటుంది దానికి సమానంగా జామాకులలో కూడా ఫైబర్ శాతం ఎక్కువ. జామ ఆకులు మన జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి సహకరిస్తుంది, మలబద్ధకం నిరోధిస్తుంది. శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులను అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
క్యాన్సర్ రాకుండా
జామలో లైకోఫిన్ అని పిలవబడే ముఖ్యమైన పోషక పదార్థం ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్, ఇది శరీరంలో క్యాన్సర్ కు దారితీసే హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించడానికి సహాయపడుతుంది. అలాగే జామ ఆకుల తో కషాయం లేదా టీ చేసుకుని తాగడం వల్ల కేన్సర్ కణాలకు చెక్ పెట్టవచ్చు.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన కొల్లాజన్ ఉత్పత్తిలో జామ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం చేసే పెక్టిన్ జామలో లభిస్తుంది. అంతేకాకుండా జామ ఆకులను పేస్ట్ చేసి మొహానికి ఫేస్ పాక్ లా వేసుకోవడం వల్ల మొహం మీద మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోయి చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. ఇంకా జామ ఆకులను నీళ్లలో మరిగించి కషాయంలా చేసి ఆ నీటితో మొహాన్ని శుభ్రపరచుకోవడం వల్ల మొహం మీద మృతకణాలు తొలగిపోయి కాంతివంతంగా తయారవుతుంది.
వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
సాధారణంగా శరీరంలో వ్యాధినిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉన్న విటమిన్ ఏది అంటే సి విటమిన్. జామలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల జామ తరచుగా తీసుకునే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని పెద్దల అభిప్రాయం కూడా. అయితే పండుకు సంబంధం లేకుండా జామ ఆకులు ఎపుడూ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి జామ ఆకుల కషాయం వల్ల వయసు పరంగా వచ్చే ముడతలు నివారించి చర్మాన్ని యవ్వనంగా కూడా ఉంచుతుంది.
మధుమేహానికి
మధుమేహరోగులు నిరభ్యరంతంగా తీసుకోగలిగిన పండు జామ. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించే గుణం జామ లో ఉంది. అలాగే జామ ఆకులలో ఉన్న పీచుపదార్థం వల్ల జీర్ణవ్యవస్థ క్రమబద్ధంగా కొనసాగుతుంది. జామ ఆకులను నీటిలో మరిగించి కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల షుగర్ వల్ల ఎదురయ్యే ఇతర సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకోవచ్చు. జామ ఆకుల రసాన్ని తీసుకుంటే శరీరానికి కావలసిన ఫైబర్ ను సులభంగా పొందవచ్చు.
ఆడవారి నెలసరి సమయంలో నొప్పికి
నెలసరి సమయంలో ఆడవాళ్లను బాధించే సమస్య కడుపునొప్పి. అయితే అలాంటి సమయంలో టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వేడి అదికమవుతుందనే కారణంతో వాటికి దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళు జామ ఆకులను నీటిలో మరిగించి కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల నెలసరి సమయంలో వేధించే కడుపునొప్పి తగ్గుతుంది.
ఇంకా……
రక్తహీనత ఉన్నవారు జామ పండును లేక జామ ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల విటమిన్ E, K మరియు B6 లు ఇంకా నియాసిన్, పోలేట్, మాంగనీస్, మెగ్నీషియం ఖనిజాలను పొందవచ్చు. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ ను ఏర్పరచడానికి సహాయపడతాయి. అలాగే కొలెస్ట్రాల్ ను క్రమబద్ధీకరించడం వల్ల గుండె సమస్యలను తగ్గిస్తుంది. అలాగే విటమిన్ సి వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇన్ని అద్భుత ఆరోగ్య రహస్యాలను దాచుకున్న జామ ఆకులను ప్రతి ఒక్కరూ వాడటం వల్ల జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా.