Amazing Uses of Balusu Pandlu

ఈ పండ్లు ఎక్కడైనా ఒక్కటి కనిపించినా వదలకండి. వెంటనే తినండి

వర్షాకాలం వచ్చేసింది. సీజనల్గా దొరికే చాలా రకాల పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ మార్కెట్లో దొరకని కొన్ని పండ్లు కూడా ఉంటాయి. బలుసు పండ్లు గురించి మీకు తెలుసా? పల్లెల్లో ఉండేవారు, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ మొక్కలు దళసరి ఆకులతో చెట్టు నిండా ముళ్ళతో పొలాలకు కంచెలుగానో, లేక రోడ్డు పక్కన, తుప్పలు పొదల్లోనో  ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వర్షాకాలం రాగానే చెట్టుకు గుండ్రటి ఆకుపచ్చని కాయలు వస్తాయి. ఇవి దోరగా ఉన్నప్పుడు గంధం రంగులోనూ, పండినప్పుడు కాఫీ కలర్లోనూ గుత్తులు గుత్తులుగా ఉంటాయి. 

కొన్నేళ్ల క్రితం వరకు చిన్న పిల్లలు స్కూలుకు సెలవులు వస్తే ఈ పండ్లను సేకరించడానికి పొలాలకు వెళ్లేవారు. ఈ పండ్లను ఎంతో ఇష్టంగా తినేవారు అప్పటి పిల్లలు. ఇలా సహజంగా దొరికే పండ్లను తినడం వల్ల అప్పటి పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పడు మార్కెట్లో దొరికే పండ్లు కెమికల్స్ స్ప్రే చేసి దొరుకుతున్నాయి. వీటిని తినడం వలన ఆరోగ్యం పొందకపోగా  అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నాం. ఈ బలుసు పండ్లను బలిజ పండ్లు, బలిజ, బర్బుజా, బలుసు వంటి అనేక పేర్లతో ప్రదేశానికో పేరుతో పిలుస్తారు.

 ఇవి రుచిలో చాలా మధురంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చిన్న పిల్లల్లో ఎదుగుదల చాలా బాగుంటుంది. మెదడు పనితీరును వృద్ధి చేస్తుంది పిల్లల్లో క్యాల్షియం లోపం నివారించి ఎముకలను పటిష్టం గా చేస్తుంది. ఎత్తు పెరగాలనుకొనే పిల్లలకు బలుసు పండ్లు చాలా బాగా సహాయపడుతాయి. కడుప సమస్యలు తొలగిస్తాయి. వర్షాకాలంలో వచ్చే రోగాలను సమర్థంగా ఎదుర్కొంటాయి.

ఇప్పుడు అంతు చిక్కని అనేక వ్యాధులు బారిన పడుతున్నాం. పూర్వకాలంలో తినేటువంటి ఇలా సహజమైన ఆహారాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి రోగాలకు గురి కాకుండా కాపాడేవి. కొనుక్కుందాం అన్నా దొరకని ఈ పండ్లను వీలైతే, అందుబాటులో ఉంటే తప్పకుండా తినండి. పిల్లలకు తినిపించండి. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!