Amazing uses of Mulla Gorinta plant

ఈ మొక్క కనిపిస్తే అసలు వదలొద్దు. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ముళ్ళగోరింట మొక్క మనకి రోడ్డుకిరువైపులా, పంట పొలాల చుట్టూ, అడవి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క యొక్క పువ్వులను ముళ్ళగోరింట, తేనె పువ్వులు, గొబ్బి పూలు వంటి పేర్లతో పిలుస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే ఈ పువ్వులు విస్తారంగా ఉంటాయి. వీటిని సేకరించి శివునికి పూజించడానికి మహిళలు ఉపయోగిస్తారు. అలాగే పల్లెటూర్లలో ఈ పూలను సేకరించి స్త్రీలు తలలో అలంకరణకు ధరిస్తారు. ఈ పువ్వులు చూడడానికి పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. మొక్క  శాస్త్రీయ నామం అకాంతేసి. ఇది బాలేరియా ప్రయాంతిస్ కుటుంబానికి చెందినది. 

ఈ మొక్క యొక్క పువ్వులను పిల్లలు సేకరించి కింది వైపున నోట్లో పెట్టుకొని పీల్చడం వలన తీపి ద్రవం తేనెలా నోట్లోకి వస్తుంది. దీనిని పిల్లలు ఆస్వాదిస్తూ ఆనందించేవారు. ఈ మొక్కలు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వీటిని సేకరించి శివుడికి, విష్ణువుకు కూడా పూజలు చేయడానికి ఉపయోగిస్తారు. వీటిని బంగారు పూలతో సమానంగా భావిస్తారు. మహా శివుడికి ప్రీతికరమైన ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే సువర్ణ పుష్పం అని పిలుస్తారు. ఈ పూలతో భగవంతుడిని పూజించడం వలన బంగారు పూలతో పూజించిన ఫలితం లభిస్తుంది. 

ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల నర దిష్టి తగలదు అని నమ్ముతారు. అలాగే ఈ చెట్టు ఆయుర్వేద, యునాని, సిద్ధ వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిలో అనేక ఆయుర్వేద వైద్య గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ముళ్ళ గోరింట మొక్కను సంస్కృతంలో వజ్రదంతి అని పిలుస్తారు. ఈ మొక్క యొక్క ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన, నోటి పూత తగ్గుతాయి. దంతాలు బలంగా తయారవుతాయి. ఈ ఆకులను పొడిచేసి ఉప్పుతో కలిపి దంతధావనం చేయడం వల్ల సమస్యలు తొలగి బలంగా అవుతాయి. ఈ చెట్టు యొక్క వేరుతో పంటిని తోమడం వల్ల పంటి సమస్యలు తగ్గించుకోవచ్చు. 

అలాగే కాళ్ళ పగుళ్ళకు ఈ ఆకు పేస్ట్ చాలా బాగా పని చేస్తుంది. పాదాలు పగిలినప్పుడు ఈ ఆకులను మెత్తగా నూరి ఆ పేస్ట్ను రాయడంవల్ల కొన్ని రోజుల్లోనే పగుళ్లు తగ్గి పాదాలు అందంగా తయారవుతాయి. ఒంటి నొప్పులు ఉన్నప్పుడు ఈ ఆకుల పేస్ట్ ను అప్లై చేయడం వలన శరీరంలో పెయిన్స్ తగ్గుతాయి. కీళ్ల నొప్పులు శరీరంలో కొవ్వు తగ్గడానికి ఈ మొక్క పై బెరడును సేకరించి నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని అర స్పూన్ మొత్తంలో రోజూ రెండు సార్లు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, శరీరంలో కొవ్వు కరగడం మొదలవుతుంది. కఫంతో కూడిన దగ్గుకు ఈ ఆకుల రసాన్ని తేనేతో కలిపి రెండు స్పూన్లు తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది.

 అలాగే చిగుళ్ల నుండి రక్తం కారుతుంటే ఈ ఆకుల రసంతో నోటిని పుక్కిలించడం వలన చిగుళ్ళు నుండి రక్తం కారడం ఆగిపోతుంది. నోటి పూత సమస్యకు ఈ ఆకుల రసాన్ని లేదా వేరు యొక్క కషాయాన్ని పుక్కిలించడం వలన నోటి పూత తగ్గుతుంది. ఎలుక కరిచినప్పుడు వేరు యొక్క కషాయాన్ని తాగడం వల్ల విష ప్రభావం తగ్గిపోతుంది. ఈ ఆకుల కషాయం తాగడం వలన వీర్యవృద్ధి జరుగుతుంది వీర్యకణాల సంఖ్య పెరిగి సంతాన సామర్థ్యం వృద్ధి అవుతుంది. ఈ ఆకుల రసాన్ని 5 గ్రాముల నుండి 20 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఆకుల కషాయాన్ని 50 గ్రాములు నుండి 100 గ్రాములు లోపు మాత్రమే తీసుకోవాలి. 

Leave a Comment

error: Content is protected !!