kanuga-leaves health benefits

ప్రతిరోజూ కేవలం 3 ఆకులతో ఇలా చేస్తే చాలు కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని వ్యాధులకు మందుగా పనిచేస్తుంది

ప్రకృతి మనకు ఎన్నో రకాల మొక్కలు అందించింది.అందులో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. అందులో ఒకటే కానుగ మొక్క. ఇంటిచుట్టు ఖాళీ స్థలాల్లో, పార్కుల్లో నీడకోసం వేసే ఈ మొక్కలు ఆయుర్వేదం , సిద్ధ యునాని వైద్యం లో ఔషధిలుగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆకులు కొంచెం గుండ్రంగానూ, కాయలు సీమ బాదంకాయల్లా ఉండి పగలగొడితే లోపల గింజలు ఉంటాయి. ముఖ్యంగా వీటినుండి కానుగ నూనెకూడా తీస్తారు. 

ఈ నూనెను ఆహారంలో వాడంకాని మారుమూల పల్లెల్లో కరెంటు లేనిచోట దీపాలు వెలిగించడానికి, ఇంజన్ ఆయిల్గా కూడా వాడతారు. ఈ చెట్టు బెరడు, కాయ, పువ్వులు, కాండం, వేర్లు అన్నీ అనేక ఔషధగుణాలు కలిగి ఉన్నాయి. ఈ మొక్కను అనేక చికిత్సల్లో ముఖ్యంగా చర్మసమస్యలు, గజ్జి, తామర, స్కివిజ్, హెర్పిస్ , తెల్లమచ్చలు, పొడలులాంటివన్నీ తగ్గేందుకు సహాయపడతాయి.

 ఈ కానుగచెట్టు ఆకులు, జిల్లేడుచెట్టు ఆకులు, జాజిచెట్టు ఆకులు గోమూత్రంతో అన్నీ నూరి పేస్ట్ లా చేసి సమస్య ఉన్నచోట వాడితే సమస్య తగ్గుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఈ కానుగ గింజలు పొడి మూడుగ్రాములు, ఆవుపాలు యాభైగ్రాములతో కలిపి తాగుతుంటే సమస్య పోతుంది. 

అధికజ్వరంతో బాధపడుతుంటే ఈ కానుగ గింజల పొడి పదిగ్రాములు, పిప్పళ్ళు పదిగ్రాములు తీసుకుని నీటితో మెత్తగా నూరి గోళీల్లా చేసుకుని నీడలో  గాలికి ఆరబెట్టి నిలవ ఉంచుకోవచ్చు. జ్వరం వచ్చిన వారు మూడుపూటలా ఒకొక్కటి  తీసుకోవాలి. పిల్లల్లో కోరింతదగ్గు వస్తుంటే కానుగపప్పు ఎండబెట్టి దంచుకుని పొడిచేసి పూటకి ఒకగ్రాము చొప్పున తేనెతో కలిపి తీసుకుంటే కోరింతదగ్గు తగ్గిపోతుంది. 

పురుషులలో వృషణాల వాపు వచ్చినప్పుడు కానుగ గింజల పప్పు, గచ్చకాయల పప్పు, ఆముదం గింజల పప్పు సమానంగా తీసుకుని వంట ఆముదంతో నూరి వృషణాలపై పట్టులా వేసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే తీసేస్తూ ఇలా నాలుగయిదురోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 చిన్నపిల్లల్లో కంటి సమస్యలు ఉంటే ఈ కాయలను నల్లదారానికి కట్టి మెడలో వేస్తే కంటిసమస్యలు తగ్గిపోతాయి. గొంతుసమస్యలు ఉన్నవారికి రెండు గ్రాముల కానుగపప్పు పొడిలో పదిగ్రాముల తేనెకలిపి  తీసుకుంటే  గొంతునొప్పి, మంట ఇన్పెక్షన్ తగ్గిపోతాయి. అతిమూత్రం సమస్య ఉన్నవారు కానుగ పూల పొడిని మూడుగ్రాములు తీసుకుంటుంటే తగ్గిపోతుంది. 

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

Leave a Comment

error: Content is protected !!