amazming health benefits of horsegram and green gram

కట్టుతో రోగాలు పారిపోతాయ్!! కట్టేంటి అనుకుంటున్నారా?? చదవండి మరి.

మన ఆహారంలో భాగం పప్పు దినుసులు. ఈ కోవకు చెందినవే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు మొదలైనవి. అలాగే బలవర్థకమైనదిగా చెప్పుకునే ఉలవలు కూడా కొందరు ఎక్కువగా వాడుతుంటారు మరికొందరు అసలు వాడకుండా దూరం ఉంటారు. అయితే ఈ పప్పు దాన్యాలతో కూరలు వండుకుని తినడం కాకుండా వీటితో కట్టు చేసుకుని తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతో గొప్పగా ఉంటుందని నిపుణులు మరియు ఆర్మయుర్వేద పండితుల అభిప్రాయం. అసలు కట్టు ఏంటి?? ఇది ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది వంటి విషయాలు మీకోసం చూడండి.

◆కంది, పెసర, ఉలవ వంటి పప్పు ధాన్యాలను  తీసుకున్న మోతాదుకు దాదాపు 8 రెట్ల నీటిని పోసి సగం అయ్యేదాక ఉడికించిన పలుచని మిశ్రమాన్ని కట్టు అని అంటారు. దీనికి చింతపండు వేయకుండా కేవలం టమాటాలు, తినగలిగిన వాళ్ళు పులుపుకోసం పుల్లని దానిమ్మ గింజలను వాడుకుని తగినంత పోపు వేసుకుని అన్నంతో కలిపి తింటారు. 

◆కందిప్పుతో కాచిన కట్టు రక్తవృద్ధికి తోడ్పడుతుంది. ఇందులో వాము, శొంఠి, ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకుంటే రుచిగానూ మరియు కట్టును ఎక్కువ తినేయడం వల్ల కలిగే దోషాలను అరికట్టవచ్చు.  అయితే వీటిని నేతిలో వేయించి పొడి చేసుకోవాలి.

◆ఉబ్బసం, దగ్గు, జలుబు, తుమ్ములు మొదలైన సమస్యలతో బాధపడేవారికి ఈ కందిపప్పు కట్టు అద్భుతంగా పనిచేస్తుంది.

◆ధనియాలు, జీలకర్ర ను విడివిడిగా నేతిలో వేయించి  తగినంత ఉప్పు కలిపి పొడిచేసుకుని నిల్వచేసుకోవాలి. ప్రతిరోజూ పెసర కట్టు కాచుకుని గ్లాసుడు కట్టులో ఒక చెంచా తయారుచేసుకున్న పొడి కలిపి తాగితే కఫము, పైత్యము వంటి వ్యాధులు అదుపులోకి వస్తాయి.

◆ పుళ్ళు, గాయాలు, ఆపరేషన్ లు అయినపుడు కూడా పెసరకట్టును నిరభ్యరంతంగా తీసుకోవచ్చు. మందుల వాడకం ఎక్కువగా ఉన్నపుడు శరీరం వేడి చేస్తుంది. కాబట్టి చలువ చేసే గుణం ఉన్న పెసరకట్టు తీసుకోవడం ద్వారా వేడి అణిచివేస్తుంది.

◆షుగర్ వ్యాధి ఉన్నవారు మరియు నరాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు పెసరకట్టు తీసుకోవడం వల్ల నరాలలో పటుత్వం పెరిగే అవకాశం ఉంటుంది.

◆కుష్టు, బొల్లి, సొరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు రోజూ పెసరకట్టు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

◆మొలలు, ఫిస్టులా వ్యాధులతో బాధపడేవారు రోజూ పెసరకట్టు తీసుకుంటే  విరేచనం సాఫీగా అయ్యి, వ్యాధి వలన ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయి.

◆పెసలు, బియ్యం సమానంగా తీసుకుని అన్నంలా వండి గంజి వార్చాలి ఇందులో ఉప్పు, ధనియాలు పొడి, జీలకర్రపొడి, పులుపు కోసం దానిమ్మ రసం కలిపి పోపు వేసుకోవాలి. దీన్ని తీసుకుంటే జ్వరంతో వచ్చే ఒళ్ళు మంటలు, నొప్పులు తగ్గుతాయి, పైత్యం తొందరగా తగ్గుతుంది.

◆బిపి ఉన్నవారికి కూడా పెసరకట్టు బాగా పనిచేస్తుందిమ్ శనగలతో కూడా పెసరకట్టు చేసుకుని వాడచ్చు అయితే శనగలు బాగా ఎండబెట్టి, దోరగా వేయించి వాడుకోవాలి.

◆బాలింతలు శనగకట్టు తీసుకుంటే చనుబాలు వృద్ధి అవుతాయి. అలాగే నెలసరి సరిగా రాసి స్త్రీలు తీసుకుంటే ఋతుక్రమం సక్రమంగా వస్తుంది. ఊపిరితిత్తులకు, మూత్రపిండాలకు, లివర్ కు బలాన్ని చేకూరుస్తుంది.

◆ఉలవకట్టు కడుపు ఉబ్బరం, వాతం,అజీర్తి, పోగొడుతుంది. పక్షవాతం, కీళ్లనొప్పులు, నడుంనొప్పి ఉన్నవారు తీసుకుంటే సమస్య తొందరగా తగ్గుముఖం పడుతుంది.

◆మూత్రపిండాల లో రాళ్లు కరిగించడంలో ఉలవకట్టు దోహదం చేస్తుంది.

చివరగా…..

ఉప్పు, కారం, పులుపు వంటివి ఎక్కువ లేకుండా పైన చేపలుకున్న విధంగా కట్టు కాచుకుని తీసుకుంటే బోలెడు రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. మరి కట్టు కాచుకుని రోగాలను కట్ చేయండి.

Leave a Comment

error: Content is protected !!