◆ఉసిరికాయ గొప్ప ఆరోగ్య సిరి అని మనకు తెలిసినదే. శరీరానికి కావలసిన ఖనిజాలు మరియు విటమిన్లు ఉండటమే కాకుండా, చాలా సాధారణమైన మరియు విస్తృతమైన వ్యాధులను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని పొడిగాను, టాబ్లెట్ ల రూపంలోనూ, జ్యుస్ గానూ ఇలా రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు.
◆ ఉసిరికాయ విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం, అందువల్ల ఇది రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది మరియు జలుబు, దగ్గుతో సహా వైరల్ మరియు బ్యాక్టీరియా వ్యాధులను నివారిస్తుంది. దీనిలోని యాంటీ క్యాన్సర్ ఏజెంట్ లు క్యాన్సర్ కణాల అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి.
◆ ఆయుర్వేదం ప్రకారం, ఉసిరికాయ రసం శరీరంలోని అన్ని సమస్యలను సమతుల్యం చేస్తుంది మరియు వాత, కఫ, పిత్త అనే మూడు దోషాలను సమతుల్యతను తెస్తుంది. “విటమిన్ సి ఒక సహజ యాంటీఆక్సిడెంట్, అంటే ఇది ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాల నుండి రక్షిస్తుంది. అలాగే వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో సహాయపడుతుంది మరియు కొల్లాజెన్ ఉత్పత్తికి ఎంతో అవసరం అందువల్ల మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే రోగనిరోధక వ్యవస్థకను మెరుగు పరుస్తుంది. ఉసిరికాయ రసంను వేసవికాలంలో తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
◆ ఉసిరికాయ రసాన్ని ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 20 నుండి 30 మిల్లిలా మోతాదు రసాన్ని గ్లాసుడు నీళ్లలో కలిపి తీసుకోవాలి. ఇది శరీర వ్యవస్థను క్లియర్ చేస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది, స్పష్టమైన చర్మం, ఆరోగ్యకరమైన జుట్టు మరియు మంచి కంటి చూపుకు దోహాధం చేస్తుంది.
◆ దగ్గు మరియు ఫ్లూతో పాటు నోటి పూతల చికిత్సకు ఉసిరికాయ జ్యూస్‌ను శక్తివంతమైన గృహ చిట్కాగా తీసుకోవచ్చు. ప్రతిరోజూ తేనెతో సమాన భాగాలతో రెండు టీస్పూన్ ఉసిరికాయ రసం కలిపి తీసుకుంటే జలుబు మరియు దగ్గు చికిత్సకు ఎంతో సహాయపడుతుంది. నోటి పూతల నుండి బయటపడటానికి రెండు టీస్పూన్ల జ్యుస్ ను గెల్సుడు నీటిలో కలిపి ఆ నీటితో నోరు మరియు గొంతును బాగా పుక్కిలించడం వల్ల నోరు, మరియు గొంతు సమస్యలు అన్ని తగ్గిపోతాయి.
◆ ఉసిరికాయ రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అమైనో ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్లు గుండె సమర్థవంతమైన పనితీరులో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఉసిరికాయ జ్యుస్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది.
◆ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులకు కూడా ఇది సహాయపడుతుంది. ఉసిరి లో ఉన్న ఆల్కలీన్ స్వభావం వ్యవస్థను క్లియర్ చేయడానికి మరియు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
◆ఇది కాలేయ పనితీరును మెరుగు పరచడంలో సహాయపడుతుంది. శరీరంలో ఉన్న టాక్సిన్లను బయటకు పంపడంలో సమర్థవంతమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి తో పాటు, ఉసిరిలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ కూడా పుష్కలంగా ఉన్నాయి, అందువల్ల దీనిని పూర్తి పోషక పానీయంగా తీసుకోవచ్చు.
◆ఉసిరిలో ఉన్న అమైనో ఆమ్లాలు మరియు ప్రోటీన్ జుట్టు పెరుగుదలకు దోహాధం చేయడం మాత్రమే కాకుండా జుట్టు రాలడాన్ని పరిష్కరించడానికి మరియు మూలాల నుండి జుట్టును బలపడచడంలో సహపడుతుంది.
◆ సూర్యకిరణాలు నుండి మన చర్మాన్ని ప్రభివితం చేసే అతినీలలోహిత కిరణాల నుండి చర్మ రక్షణలో దోహదపడుతుంది. ముఖ్యంగా చర్మాన్ని నల్లగా మార్చే మెలనిన్ ను తొలగించి చర్మం మీద ఉన్న ట్యాన్ ను తొలగిస్తుంది.
చివరగా….
ఉసిరికాయ జ్యుస్ పైన చెప్పుకున్నా ఫలితాలను మాత్రమే కాకుండా గొప్ప యాంటీ ఏజింగ్ వనరుగా కూడా దోహాధం చేస్తుంది.
మంచి విషయం అందించారు ధన్యవాదములు