Amma cheppedi 100percent correct

ఒకే ఒక స్పూన్ తో 100కు పైగా రోగాలు తగ్గిపోతాయి అసలు హాస్పిటల్కి వెళ్ళనవసరం లేదు

ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు వలన అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ అనారోగ్య సమస్యల వలన సంపాదించిన దానిలో ఎక్కువ భాగం హాస్పిటలకే ఖర్చు పెడుతున్నారు. కొన్ని చిట్కాలను పాటిస్తూ ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకున్నట్లయితే కొన్ని అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్కా 100కు పైగా రోగాలు తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. 

     ఈ డ్రింక్ తయారుచేసుకుని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. తర్వాత ఒక చెంచా ధనియాలు నీటిలో వేసుకోవాలి. ధనియాలు గ్యాస్, అసిడిటీ,గొంతులో మంట, ఛాతిలో మంట, అజీర్తి, దగ్గు, జలుబు, జ్వరం, వాత, కఫ, పిత్త రోగాలు వంటి ఎన్నో రకాల రోగాలు తగ్గించడంలో ధనియాలు చాలా బాగా సహపడతాయి. తర్వాత  దీనిలో ఒక చెంచా జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. 

         జీలకర్ర గ్యాస్, అసిడిటీ, అజీర్తి, మలబద్దకం కడుపులో మంట, గుండెల్లో మంట,  జలుబు, దగ్గు, జ్వరం వాతం కఫం   పిత్త  రోగాలను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.  జీలకర్ర ధనియాలు వేసి బాగా కలుపుకొని గ్యాస్ పై మూతపెట్టి రాత్రంతా నాననివ్వాలి.  ఉదయం లేచిన వెంటనే ఈ నీటిని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి ఐదు నుంచి పది నిమిషాలపాటు మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని వడకట్టుకోవాలి. బ్రష్ చేయగానే పరగడుపున ఈ నీటిని టీ తాగినట్లుగా కొంచెం కొంచెంగా తాగాలి. 

         ఇలా ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున ధనియాలు, జీలకర్ర వేసి తయారుచేసుకున్న కషాయాన్ని ఒక గ్లాస్ తాగినట్లయితే 100కు పైగా రోగాలు నయం అవుతాయి. ఈ కషాయం తాగడం వలన వెంటనే ఛాతిలో మంట, గొంతులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.మలబద్దకం సమస్యతో బాధపడేవారు ఈ కషాయం తాగడం వలన మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఇది వర్షకాలం కాబట్టి తరచూ జలుబు, దగ్గు వస్తూ ఉంటాయి. 

          ఈ కషాయం తాగితే జలుబు, దగ్గు నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ కషాయం ప్రతి రోజు తాగినట్లయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యల కోసం హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. ఇక నుండి మీరు కూడా ఈ చిట్కా ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోండి. 

Leave a Comment

error: Content is protected !!