amrutha kada mokka benefits

ఆడవాళ్ళకు గొప్పవరం ఈ మొక్క. ఎక్కడైనా కనిపిస్తే వదలకండి

మన భారతదేశం ఎప్పుడో మొక్కల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు కనిపెట్టి ఆ మొక్కలను ఆయుర్వేద వైద్యంలో  పెట్టడం జరిగింది. అలాంటి ఒక మొక్క గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ మొక్కను అమృత కాడ, వెన్న వెదురు, అడవి నాభి లేదా ఎండ్రాకు అని పిలువబడుతుంది. ఇది కమలిసా జాతికి చెందినది. దీని శాస్త్రీయ నామం కమలిన బెంగాల్నేసి. ఇది ఆఫ్రికాకి చెందిన మొక్క. ఇది ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తూ ఉంటుంది. 

పొలాల్లో గట్లమీద, ఇంటి చుట్టు పక్కల, గార్డెన్లలో, మట్టి ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎక్కడైనా ఎక్కువగా దొరుకుతుంది. గడ్డిలో కలుపు మొక్కగా పెరిగుతుంది ఈ మొక్క. ఈ మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు చాలా ఎక్కువ. ఈ మొక్కలను పశువులు చాలా ఇష్టంగా తినడం జరుగుతుంది. ఈ మొక్కకు యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ మొక్క గాయాలు పుండ్లు మానడం లో చాలా బాగా సహాయపడుతుంది. 

చర్మరోగాలు, మొహంపై మొటిమలు, మచ్చలు తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. వీటి ఆకులను మెత్తని పేస్ట్ లా చేసి ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్న చోట పూస్తే గాయాలు మొటిమలు చాలా త్వరగా తగ్గిపోతాయి. ఈ అమృతకాడ మొక్క ఆకులు జ్వరానికి ఔషధంగా పనిచేస్తాయి. ఈ ఆకులు ఆరు తీసుకొని 150 గ్రాములు నీటిలో అర స్పూన్ జీలకర్ర, అరస్పూన్ మిరియాలు కలిపి ఈ ఆకులు కూడా వేసి బాగా మరిగించాలి. 

ఈ కషాయాన్ని రోజుకు ఒకసారి కనుక తాగుతూ ఉంటే జ్వరం తగ్గిపోతుంది. శరీరంలో వేడిని తగ్గించి మేలు చేయడంలో చాలా బాగా దోహదపడుతుంది. ఈ మొక్కను ఆకుకూరగా కూడా వండుకొని తింటుంటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకును పాము విషానికి విరుగుడుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కు ఈ ఆకు మరియు కాండం యొక్క కషాయాన్ని తాగుతూ ఉంటారు. మూత్రంలో మంటకి ఈ ఆకు కషాయం చాలా బాగా పనిచేస్తుంది. 

మలేరియా జ్వరం తగ్గడానికి ఈ ఆకులను నలిపి ఆ రసాన్ని తాగుతారు. ఆకులను కూడా గొంతు నొప్పి ఉపశమనానికి  ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్కను ఆయుర్వేద, యునాని వైద్యంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మొక్క ఆకులను పేస్ట్ చేసి నొప్పి ఉన్నచోట పూస్తే శరీరంలోని నొప్పులను తగ్గిస్తుంది. ఈ మొక్క వేర్లను జ్వరం మరియు లివర్ వ్యాధి ఉపశమనానికి వాడతారు. రుతుక్రమంలో అధిక రక్తస్రావం తగ్గడానికి ఉపయోగిస్తారు. స్త్రీలలో సంతాన సమస్యలు తగ్గించడానికి కూడా ఈ మొక్కలు ఉపయోగిస్తారు.

Leave a Comment

error: Content is protected !!