amzing health benefits of dry fruits

డ్రై ఫ్రూట్స్ తినడం ఎంతవరకు ఆరోగ్యం??

ఇంట్లో పాయసాలు, స్వీట్లు తయారుచేస్తే వాటిలో తప్పక జోడించేవి డ్రై ఫ్రూట్స్. ఇవి ఖనిజాలు, ఎంజైములు, విటమిన్లు అధికంగా కలిగి ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బలమైన వ్యాధి నిరోధక శక్తి గా పనిచేస్తాయి. రోజువారి జీవితంలో అల్పాహారం లేదా భోజనం లేనప్పుడు లేదా తినడానికి సమయం లేనప్పుడు డ్రై ఫ్రూట్స్ లు తగినంత తీసుకోవడం వల్ల నీరసం తొలగిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి.

◆డ్రై ఫ్రూట్స్ ను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తీసుకోవడం వల్ల శరీరంలో కొత్త రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. అంతేకాదు రక్తానికి ఆరోగ్యకరమైన ఆక్సిజన్ లు అందడం వల్ల రక్త కణాలు అభివృద్ధి అవుతాయి. ఫలితంగా హిమోగ్లోబిన్ పెరుగుదల బాగుంటుంది దీనివల్ల అనీమియా నివారించబడుతుంది

◆డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను శక్తివంతం చేస్తుంది. అందువల్ల అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలు సులువుగా మటుమాయం అవుతాయి. డ్రై ఫ్రూట్స్ లో ఉన్న బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థకు దోహద పడుతుంది

◆డ్రై ఫ్రూట్స్  బాగా ఎండిన ఫలాలు కావడంతో అందులో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ చాలా ఉంటాయి. వీటివల్ల గుండెకు కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా అందుతాయి. అందుకే డ్రై ఫ్రూట్స్ ను తీసుకునేవారిలో గుండె సంబంధ వ్యాధులు ఆమడ దూరం లో ఉంటాయి.

◆పోషకాలు, విటమిన్లు సమృద్ధిగా శరీరానికి అందితేనే అది జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల చాలా మంది జుట్టు పెరుగుదల కోసం పైపై నూనెలు, మందులు, ప్యాక్ లు మాత్రమే కాకుండా తగిన పొషక పదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది.

◆డ్రై ఫ్రూట్స్ లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల కాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుని కాన్సర్ కు దూరంగా ఉంచుతుంది.

◆డ్రై ఫ్రూట్స్ లో కేరోటినాయిడ్స్, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

◆డ్రై ఫ్రూట్స్ లో కాల్షియం, ఐరన్ అధికంగా ఉండటం వల్ల ఎముకల బలానికి దోహదపడతాయి. 

◆బాదం, పిస్తా, అంజీర్, ఖర్జురం, గుమ్మడి విత్తనాలు, దోస విత్తనాలు, ఎండు ద్రాక్ష వంటి పండ్లు ఆయా కాలాల్లో తప్ప వేరే కాలంలో దొరకవు. కానీ వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వాటిని డ్రై ఫ్రూట్ రూపం లో తీసుకుంటారు. వీటిని ప్రతిరోజు కనీసం నాలుగు నుండి ఐదు అయినా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందించిన వాళ్ళు అవుతాము

Leave a Comment

error: Content is protected !!