amzing health benefits of tulsi leaves

పరగడుపున 3 తులసి ఆకులు తింటే ఈ రోగాలన్నీ మాయం

హలో ఫ్రెండ్స్.. తులసి చెట్టు ను హిందువులు దైవంలా పూజిస్తారు. అదేవిధంగా ఆయుర్వేదంలో కొన్ని వ్యాధులకు చికిత్సగా మరియు భారతీయ సాంప్రదాయ వైద్యంలో పూర్వం నుండి విరివిగా వాడుతున్నారు. తులసి ఆకులలో ఉండే పోషకాలు మానవుల యొక్క అనేక రోగాలకు ఔషధాలు గా పనిచేసి వ్యాధిని నయం చేస్తాయి. తులసి చెట్టు మన ఇంట్లో పెంచుకోవడం వలన అనేక రోగాలు రావని మన పెద్దలు చెబుతారు. అందుకే తులసి చెట్లను ప్రతి ఇంట్లో పెంచుకుంటారు. తులసి చెట్లు ఎక్కడైనా లభిస్తాయి. ఈరోజు మనం పరగడుపున మూడు తులసి ఆకులను ప్రతిరోజు తింటే మన శరీరంలో కలిగే మార్పు మరియు అది ఏ విధంగా మనకు మేలు చేస్తుందో తెలుసుకుందాం.


ప్రతిరోజు మూడు తులసి ఆకులను పరగడుపున తింటే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈరోజుల్లో ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో ఆధునిక జీవన శైలిలో ఉరుకుల ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అలాంటి వారు పరగడుపున మూడు తులసి ఆకులు తింటే మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మంచి ఆలోచనలు కలిగేలా సహాయం చేస్తుంది. ఇలా తినటం వలన షుగర్ వ్యాధితో బాధపడేవారికి చాలా మేలు చేస్తుంది.

ప్రస్తుతం శ్రమలేని ఉద్యోగాలు అధికమవడం నిత్యం కదలకుండా కూర్చుని ఉద్యోగాలు చేయటం వల్ల షుగర్ వ్యాధి బాగా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ రోజు ఇలా రోజూ మూడు తులసి ఆకులను తింటూ ఉంటే వారికి షుగర్ వ్యాధి రాకుండా లేదా వచ్చిన తగ్గేలా చేస్తుంది. తినటం వలన అధిక రక్తపోటు సైతం అదుపులో ఉంచుతుంది. రక్తపోటు సమస్యతో బాధపడే వారు గుర్తుంచుకొని ప్రతి రోజు 3 తులసి ఆకులు పరగడుపున తింటూ ఉంటే కొన్ని రోజులకే ఆధునిక మందులతో పని ఉండదు.

ప్రతి రోజు ఇలా తింటే జ్ఞాపకశక్తి వృద్ధి అవుతుంది చదువుకునే పిల్లలు ప్రతిరోజూ మూడు ఆకులను తింటూ ఉంటే వారి మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గి చదివింది వెంటనే అర్థం చేసుకునే శక్తి మెదడుకు కలిగేలా చేస్తుంది. తద్వారా వారు చదువులో దూసుకుపోతాయి. ప్రతిరోజు ఇలా తినేవారి శరీరం దృఢంగా మారుతుంది ముఖ తేజస్సు పెరుగుతుంది. ఎవరైతే తలనొప్పితో బాధపడుతున్నారు అలాంటి వారు నిత్యం ఓపిక చేసుకొని ఇలా తులసి ఆకులను తింటూ ఉంటే తలనొప్పి క్రమంగా తగ్గి భవిష్యత్తులో అస్సలు రాదు తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే తక్షణం తగ్గుతుంది.

ప్రతిరోజు మూడు తులసి ఆకులు పరగడుపున తింటే నోటి దుర్వాసన పోయి నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మానసిక ఎదుగుదల లేని పిల్లలకు ఇలా తినిపిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా తింటూ ఉంటే పొట్టలో పుండ్లు ఉంటే మానేలా చేస్తుంది. ఇలా తినటం మూలాన తరచూ జలుబు చేయటం జ్వరం రావటం తగ్గి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

అజీర్తి సమస్యతో బాధపడేవారు ఇలా తినటం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. తరచూ కడుపునొప్పితో బాధపడేవారు ఇలా తింటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. నిత్యం ఇలా తినేవారికి కంటి చూపు మెరుగుపడుతుంది. వయసు పైబడినవారు రోజు ఇలా తింటూ ఉంటే వారి దృష్టి లోపాలను పోగొడుతుంది మరియు చూపును పెంచుతుంది.

మలేరియా జ్వరం ఇబ్బంది పెడుతూ ఉంటే ఏడు తులసి ఆకులను, ఏడు మిరియాలు కలిపి నమిలి మింగాలి ఇలా చేస్తూ ఉంటే మూడు రోజుల్లో మలేరియా జ్వరం తగ్గిపోతుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న తొలి సేవకులను రోజూ పరగడుపున మూడు తులసి ఆకులు తిని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి

Leave a Comment

error: Content is protected !!