amzing-health-beneftis-of-Pranayamam

ప్రాణాయామం చేస్తే రోగాలు మీ దగ్గరికి రావు

డియర్ ఫ్రెండ్స్ చాలామందికి కి యోగాసనాలు వేయాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నా వారి శరీరతత్వం అనుకరించ కపోవడం పలురకాల అనారోగ్య సమస్యల వల్ల వాటికి దూరంగా ఉంటారు కానీ ఈ యోగా ఆసనాలు మించిన అద్భుత ఫలితాలను పొందే మరొక మార్గం ప్రాణాయామం.

ప్రస్తుతం ప్రాణాయామం అనే మాటను వినని వారు సాధారణంగా ఉండరు. పలు సంస్థలు పలుచోట్ల శిక్షణలు నిర్వహించడం ప్రచారం జరపటం మూలంగా అందరికీ ఈ మాట తెలిసిందే. గతంలో అయితే గుడిలోకి వెళ్ళినప్పుడు పెళ్లి శుభకార్యాలప్పుడు అయ్యవారు ముక్కు పట్టుకొని గాలి పీల్చుకో నాయనా అని చెప్పటం మనకు అర్థం కాకున్నా తంత్ర లాగా ముగించేవారు. కానీ ఇప్పుడు దీని విలువ తెలిసాక అప్పుడు నవ్వినవారే  నేర్చుకోవడానికి పరుగులు తీస్తున్నారు.

మనిషి జీవనానికి ఆధారం ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. మనం ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే మన శరీర వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనికి అవసరమైన శ్వాసక్రియ అసంకల్పితంగానే జరుగుతుంది. దీనివలన మనం 500 మిల్లీ లీటర్ల గాలిని మాత్రమే తీసుకోగలుగుతాం. కానీ మన ఊపిరితిత్తులకు దాదాపు రెండున్నర లీటర్ల గాలిని తీసుకోగలిగే అవకాశం ఉంది. మనం కనుక సంకల్పించి పూర్తిగా గాని తీసుకుంటే ఐదు లీటర్ల గాలిని పీల్చి వచ్చని డాక్టర్ చెబుతూ ఉంటారు. శ్వాస క్రియ ద్వారా మనం పీల్చే గాలి పరిమాణం పెరిగితే జీవకణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. జీవ కణాలు శక్తివంతంగా కూడా అవుతాయి. అవి శక్తివంతం అయ్యాయంటే ఆరోగ్యంగా ఉన్నట్లే.

ప్రాణాయామంతో పాటు శరీర కండరాలు కూడా బాగా బిగించటం వదులు చేయటం ద్వారా శక్తివంతం చేయవచ్చు. శరీర భాగాలను పైకి కిందకు కదిలిస్తూ ఉంటే శక్తిని పొందుతూ ఆరోగ్యం కాపాడుకుంటాం.  దీనిని యోగాసనాలు మన మహర్షులు మనకు అందించారు. ఇక ప్రాణాయామం చేయడానికి ముందు మనం కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఎక్కువ ఆరోగ్య ప్రయోజనం పొందడానికి ఉదయం పూట చేస్తే మరింత మేలు జరుగుతుంది. గ్రౌండ్ లో కానీ పార్క్ లో కానీ లేదా తలుపులు తెరచిఉన్న గదిలోగాని కంబలి లేదా బట్ట లేదా ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి. గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు మురికిగా ఉన్న చోట దుర్వాసన వస్తున్న చోట పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. సిగరెట్ బీడీ చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు అంటే ఏదైనా తిన్న తర్వాత వెంటనే ప్రాణాయామం చేయకూడదు

ఈ ప్రాణాయామం వల్ల కలుగు ఆరోగ్య ప్రయోజనాలు

ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి ప్రాణాయామం ఒక ఉత్తమ శ్వాస తీసుకోవడానికి ఒక మంచి టెక్నిక్ కూడా. ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ ప్రాణాయామం కూడా చాలా సహాయపడుతుంది.
బరువు తగ్గించడంలో కూడా ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాణాయామం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాల యొక్క కార్యాచరణకు మాత్రమే పరిమితం కాదు. ప్రాణాయామం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. రెగ్యులర్గా ప్రాణాయామం చేయడం వల్ల తప్పనిసరిగా మంచి ఫలితాలని పొందవచ్చు.

ప్రాణాయామం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు శుభ్రపడి మలినాలను బయటకు నెట్టివేస్తాయి. శరీరం శుభ్రపరచుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి అందులో ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. డిప్రెషన్ ను ఆందోళనను తగ్గించడంలో కూడా ప్రాణాయామం కీలకపాత్ర పోషిస్తుంది. చాలామంది ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ప్రాణాయామం అలాంటి వారికి నాసల్ ప్యాసేజ్ శుభ్రపరుస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ అనేక రకాల సమస్యలకు ఉన్న ఒకే ఒక మార్గం వ్యాధినిరోధకతను పెంచుకోవడం ఈ ప్రాణాయామం వల్ల వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చు.

జీర్ణక్రియను ఈ ప్రాణాయామం మెరుగుపరుస్తుంది. అసాధారణ ఆహార అలవాట్లు కలిగిన వారికి యోగ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగులు నరాలు నాడులు శుభ్ర పడతాయి. ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ప్రాణాయామం వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. ప్రాణాయామం టెక్నిక్స్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది. తద్వారా ఆక్సిజన్ మీ రక్తంలో పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!