Anasa puvvu Star Anise Health benefits

అనాస పువ్వు గూర్చి మీకు తెలియని నిజాలు

వంటింట్లో ఏదో గమ్మత్తు ఉంటుంది. బహుశా వంటలకు ఉపయోగపడుతూ మన  ఆరోగ్యాగ్యానికి  అమృతంలా పనిచేసే అద్భుతాలు అక్కడ ఉంటాయి అందుకే కాబోలు. మసాలా దినుసుల డబ్బాను చూస్తే ఘుమఘుమలు గుర్తొస్తాయి. అలాగే మన పెద్ధోళ్ళు మసాలా ఫుడ్ తినొద్దంటే నీరసం కూడా వచ్చేస్తుంది వాళ్ళ మాటలకు. అయితే మన వంటింట్లో మసాలా దినుసుల్లో ముచ్చటైన నక్షత్రంలా ముద్దుముద్దుగా ఉండే అనాసపువ్వు గూర్చి చాలా తక్కువ మందికే తెల్సు.  ఇంతకు అనాసపువ్వులో ఉన్న మ్యాజిక్ ఏంటో ఒకసారి చూసేద్దాం రండి.

◆పులావ్ లు బిర్యానీలు మసాలా కూరల్లో మెరిసే ఈ పువ్వును ఇంగ్లీష్ లో స్టార్ అనిస్ అంటారు. ఈ అనాస పువ్వులో విటమిన్-ఎ, విటమిన్-సి మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. 

◆అనాసపువ్వులో ఉండే ధైమోల్, టెర్పినోల్  అనేవి జలుబు, దగ్గు, శ్వాసకోసం పై దాడి చేసే బాక్టీరియాను తొలగించడంతో సహాయపడతాయి. 

◆అపుడపుడు మనల్ని వేధించే కడుపులో వికారం, ఉబ్బరం వంటి జీర్ణాశయనికి సంబందించిన సమస్యలను నిర్మూలించి సమర్థవంతమైన జీవక్రియకు సహకరిస్తుంది.

◆నెలనెలా మహిళల్లో ఎదురయ్యే సమస్య గూర్చి అందరికి తెలిసినదే. అయితే ఈ నెలసరి సమయంలో మహిళలను ఇబ్బంది పెట్టే తిమ్మిర్లు, కడుపునొప్పి వంటివి తగ్గించడంలో  ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

◆అనాసపువ్వు టీ ని ఒవేరియన్ సమస్యతో బాధపడుతున్న మహిళలు వాడినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులలో నెలకొనే సమస్యలను, ఈస్ట్రోజోన్  హార్మోన్ స్థాయిని క్రమబద్దీకరించే గుణం అనాసపువ్వుకు ఉంది.

◆మన కడుపు భాగంలో ఉండే పేగుల కండరాలు ముడుచుకుపోయి కడుపును బిగించినట్టు ఎదురయ్యే సమస్యకు అనాసపువ్వును వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పేగులు కండరాలు వదులు అయ్యి ఆహారం సక్రమంగా జీర్ణమవుముతుంది, మరియు మలబద్దకం సమస్య తొలగిపోతుంది.

◆అనాసపువ్వులో ఉన్న షికిమిక్ ఆమ్లం బలమైన యాంటీ వైరల్ సామర్థ్యం ను  కలిగి ఉంది. ఇది ఇన్ఫ్లూయన్ చికిత్సలో ఉపయోగించే టామిఫ్లూ అనే మెడిసిన్ లో భాగంగా ఉంటుంది.

◆హెర్పెస్ సింప్లెక్స్ తో సహా ఇతర రకాల వైరస్ ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో అనాసపువ్వు అద్భుతంగా పనిచేస్తుంది.

◆ఇందులోని ఫ్లేవనాయిడ్స్, అనేథోల్ శక్తివంతమైన యాంటీ ఫంగల్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మన శరీరంలో కలిగే ఫంగస్ ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి అనాసపువ్వు చక్కని ఎంపిక అనడంలో అతిశయోక్తి లేదు.

◆బాక్టీరియా ద్వారా వచ్చే అనేక వ్యాధులలో అనాసపువ్వును వినియోగించడానికి కారణం దీనికి బాక్టీరియను నశింపజేసే గుణం ఉంది

◆మనశరీరంలో ఎంతో ముఖ్యమైన మూత్రాశయం మరియు మూత్రనాళాల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడంలో అనాసపువ్వులోని బయోయాక్టీవ్ సమ్మేళనాలు  ప్రభావవంతంగా పనిచేస్తాయి.

చివరగా……

ఇన్ని ప్రయోజనాలు ఉన్న అనాసపువ్వును నిర్లక్యం చేయకండేం. పైన చెప్పుకున్న బోలెడు విషయాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారా?? వద్దులెండి ఆరోగ్యాన్ని ట్రాక్ లో పెట్టండి అనాసపువ్వును తెచ్చేసుకుని.

Leave a Comment

Scroll back to top
error: Content is protected !!