anti aging face mask with rice pack

తెల్ల అన్నం ఒక్కటి చాలు. ముఖంపై ముడతలు అస్సలు ఉండవు

ముఖంపై ముడతలు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మనం కింగ్ టైటనింగ్ పాక్స్ ఉపయోగిస్తుంటాం. వీటివలన ఎక్కువ ఖర్చు, సరైన ఫలితాలు లేకుండా కూడా ఉండవచ్చు. కానీ ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని చిట్కాలు ప్రారంభదశలోనే ముడతలు రాకుండా నివారిస్తాయి. ముడతలు చాలామంది చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపించేలా చేస్తుంటాయి. వీటిని నివారించడానికి మంచి ఆహారం మనపై మనకు శ్రద్ధ ఎంత అవసరమో కొన్ని రకాల చిట్కాలు పాటించడం కూడా అంతే అవసరం.

 దాని కోసం మనం మొదట చిట్కా తెలుసుకుందాం. ఒక కప్పు ఉడికించిన మెత్తటి అన్నాన్ని తీసుకోవాలి. ఈ అన్నాన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసుకోవాలి. బియ్యంలో ఉండే అనేక రకాల పోషకాలు ముఖంపై ముడతలు, పిగ్మెంటేషన్ తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా, యవ్వనంగా తయారుచేస్తాయి. అన్నం లేదా రైస్ వాటర్ గా ఉపయోగించడం వలన ముఖం గ్లాసీగా తయారవుతుందని ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందింది.

 జపాన్ కి చెందిన స్త్రీలు ఇప్పటికీ రైస్ వాటర్ని చర్మ సంరక్షణలో భాగంగా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ముఖంపై మచ్చలు తగ్గించడంలోనూ, ముడతలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలోనూ చాలా బాగా సహాయపడుతాయి. బాదం ఆయిల్ చర్మానికి తేమను అంధించడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా తయారు చేయడానికి సహాయపడుతుంది. తర్వాత చిట్కా కోసం క్యారెట్స్ తీసుకోవాలి. వీటిని మెత్తగా తురిమి పెట్టుకోవాలి.

 ఒక గిన్నె తీసుకొని అందులో క్యారెట్ తురుము వేసుకొని మునిగేలా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. క్యారెట్ మాడిపోకుండా కలుపుతూ  చిన్నమంటపై నూనెను మరిగించాలి. నూనె రంగు మారగానే స్టవ్ ఆపేసి నూనెను వడకట్టాలి. ఈ నూనెను ఏదైనా గ్లాసు బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను రాత్రిపూట ఒకటి లేదా రెండు చుక్కలు ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా రోజూ చేయడం వలన ముఖంపై ఉండే సన్నని లైన్స్, ముడతలు తగ్గిపోతాయి. ఇది చర్మానికి సీరంలా పనిచేసి చర్మాన్ని బిగుతుగా తయారుచేస్తుంది. చర్మంలో పటుత్వాన్ని పెంచి, రంగును పెంచడంలోనూ, మెరిపించడంలోనూ సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!