Anti-Aging Foods That Can Prevent Wrinkles

మిమ్మల్ని నిత్యయవ్వనంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే

వృద్ధాప్యం అనేది సహజమైన విషయం, దీనిని నివారించలేము.  , అలవాట్లు మరియు జీవనశైలి వృద్ధాప్యాన్ని వేగం చేయగలదు మరియు నెమ్మదించగలదు కూడా.  కాలంతో పాటు వయసు పెరిగినా వయసుతో పాటు మన శరీరం కూడా ముడుతలు పడి జుట్టు నెరసి బామ్మలు తాతలు అయిపోవాలనేం లేదు.  ఆహారంలో మార్పులు, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరిగినా యవ్వనంగా వుండచ్చని నిపుణులే చెబుతున్నారు. మరి అరవై వచ్చినా ఇరవైలా కనిపించాలంటే ఇదిగో కింద చెబుతున్న ఫుడ్ ను మీ డైట్ లో చేర్చుకోండి.

యవ్వనంగా ఉన్నారని ఎలా చెబుతారు అంటే ….

 – ఆరోగ్యకరమైన జుట్టు

 – బలమైన గోర్లు

 – తక్కువ రక్తపోటు

 – హైడ్రేటెడ్ స్కిన్

 – డయాబెటిస్ మరియు గుండె జబ్బుల ప్రమాదాల దరిదాపుల్లో లేకుండా

 – మంచి రక్తప్రసరణ……. ఇవన్నీ మనతో ఉండాలంటే మనకు కొన్ని పోషకాలు అవసరం. మన శరీరంలో వచ్చే ఒకో సమస్యకు ఒకో విటమిన్ ఒకో పోషకపదార్థం లోపించినట్టు లెక్క. మరి పైన చెప్పుకున్నవన్నీ లోపించకుండా ఉండాలంటే……

 – విటమిన్ సి

 – విటమిన్ ఇ

 – సెలీనియం

 – అమైనో ఆమ్లాలు

 – ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

 – విటమిన్ డి

 – విటమిన్ ఎ

 – రెస్వెరాట్రాల్…….  మొదలైన పోషకాలు అన్ని సమతుల్యంగా మన శరీరానికి అందాలి. మరి ఇవన్నీ పొందడానికి కొన్ని ఆహారపదార్ధాలు తీసుకుంటే సరిపోతుంది అవేంటో మీరే చూడండి. 

పసుపు

పసుపులో యాంటీ ఏజింగ్ మరియు స్కిన్-లైటనింగ్ లక్షణాలు ఉన్నాయి, దీనిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.  ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలదు, ఆక్సీకరణ నష్టాన్ని నెమ్మదిస్తుంది మరియు వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. రోజు రాత్రి పడుకునేముందు గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగితే ఆరోగ్యమే కాదు యవ్వనం కూడా సొంతమవుతుంది.

పెరుగు

పెరుగు ప్రోటీన్ యొక్క గొప్ప సమ్మేళనం.  ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు  జీర్ణక్రియకు సహాయపడే బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.  పెరుగులో భాస్వరం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 12 మరియు కాల్షియం కూడా ఉన్నాయి.  ఇది మీ ముఖంపై ముడతలు మరియు గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది.

టమాటా

చనిపోయిన చర్మ కణాలను తొలగించడం ద్వారా ముడతలు మరియు గీతలను తగ్గించడంలో సహాయపడే లైకోపీన్ అనే పదార్థం టమాటాలో సమృద్ధిగా ఉంటుంది మరియు చర్మాన్ని ఎండకు దెబ్బతినకుండా కాపాడుతుంది.

పాలు, గుడ్లు, చేపలు

సమతుల్య ఆహారాన్ని ఒక పట్టికలో రాస్తే తప్పకుండా స్థానం సంపాదించేవి పాలు, గుడ్లు, చేపలు. పాలలోని కొవ్వులు, కాల్షియం. గుడ్డులో కాల్షియం, బీటాకేరోటిన్. చేపలలోని ఒమేగా3 ఫ్యాటీ కొవ్వు ఆమ్లాలు శరీరానికి పుష్టికరమైన ధాతువులను అందిస్తాయి. 

డ్రై ఫ్రూట్స్

రోజువారీ ఆహారంలో బాదం, జీడిపప్పు, పిస్తా మరియు కిస్మిస్ చేర్చడం ముఖ్యం.  ఇవి అత్యుత్తమ యాంటీ ఏజింగ్ ఫుడ్స్.  ప్రతిరోజూ కనీసం గుప్పెడు మిశ్రమ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల నమ్మలేని ఫలితాలను పొందుతారు.

వెల్లుల్లి

వెల్లుల్లి అద్భుతమైన ఔషధం. ఇది శరీరాన్ని శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఫ్రీ రాడికల్స్‌ను తరిమికొడుతుంది.  చెడు కొలెస్ట్రాల్ ను  రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచగలదు. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.

కాయగూరలు, దుంపలు.

బంగాళదుంప, చిలకడ దుంప, క్యారెట్, బీట్రూట్ వంటివి మరియు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్. బఠానీ, బీన్స్, సొయా, నువ్వులు, తృణధాన్యాలు, కాకర, బీర, బెండ వంటి కూరగాయలు. అన్ని రకాల ఆకుకూరలు  తీసుకోవాలి. ఇవన్నీ యవ్వనానికి దోహదం చేసేవే.

పండ్లు

సాధారణంగా ఇప్పటి కాలంలో పండ్లు తినడంలో ఆసక్తి చూపేవారు తక్కువ, పళ్ళ రసాలు కృత్రిమంగా దొరుకుతున్నవి తాగి తృప్తి పడతారు కానీ పళ్లలో ఉన్న పూర్తి పోషకాలు పళ్ళ రసాలు ఇవ్వవు. ముఖ్యంగా సీజన్ కు తగ్గట్టు ఆ సీజన్ లో దొరికే పళ్ళను అసలు మిస్సవకండి. సీజన్లలో వచ్చే ప్రతి ఆరోగ్య సమస్యకు కూడా ఈ పండ్లే గొప్ప  ఔషధంగా పని చేస్తాయి.

చివరగా……

పైన చెప్పుకున్నవి మాత్రమే  కాకుండా అల్లం, తేనె, నువ్వులు, నెయ్యి, పాల ఉత్పత్తులు మొదలైనవి ఆహారంలో తప్పక భాగం చేసుకుంటే యవ్వనం ప్రాప్తిరస్తు. 

1 thought on “మిమ్మల్ని నిత్యయవ్వనంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే”

  1. Very informative. I’m impressed with wealth of information you provide. The best part is you are covering many health aspects both preventive & how to treat existing problems which allopathy has no answers.

    Reply

Leave a Comment

error: Content is protected !!