ప్రస్తుతం అందరికీ చిన్న చిన్న కుండీలలో మొక్కలను పెంచుకుని వాటిని ఫ్రెష్ గా కోసుకొని వాడుకునే అలవాటు కనిపిస్తుంది. ఎక్కువ స్థలం లేని వల్ల డాబా మీద టెర్రస్ గార్డెన్స్ పెట్టుకుంటున్నారు. ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న కుండీలలో కూడా చిన్న చిన్న మొక్కలు ఎక్కువగా పెంచుకుంటున్నారు. స్థలం లేదు అనుకున్న వాళ్లు పెద్దవి ప్లాస్టిక్ ట్రేలు లేదా చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలు తెచ్చుకొని కొబ్బరి పొట్టు వేసుకుని కొంచెం మట్టి వేసుకుని మొక్కలను పెంచుకోవచ్చు.
కొబ్బరి పొట్టు ఎక్కువగా వేయడం వలన కుండీలు తేలికగా ఉంటాయి. తాడుతో ఇంటి ఎదురుగా కట్టుకొని కూడా పెంచుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల మూడు పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ను పెట్టుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. శరీరంలో కణజాలం జబ్బుల బారిన పడకుండా కాపాడటానికి యాంటీ ఆక్సిడెంట్ సహాయపడతాయి. శరీరంలో ఫ్రీరాడికల్స్ తగ్గించడానికి, శరీరం ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
అలాంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే మూడింటిని మన ఇంట్లో పెంచుకుని వాడుకోవచ్చు. అవి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఒక పెద్ద ప్లాస్టిక్ కుండీల్లో ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి మట్టి కిందకు దిగి పోకుండా పైన గులకరాళ్లు వేసుకుని చుట్టూ రంధ్రాలు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కుండీలను ఎండ పడేలాగా పెట్టుకోవాలి కరివేపాకు విత్తనాలు తెచ్చి కుండీలలో వేసి కరివేపాకు పెంచుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనం కరివేపాకు ముదురు గా ఉన్న ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు.
కరివేపాకు ఎక్కువ బీటాకెరోటిన్, విటమిన్ ఎ, పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా కలిగి ఉంటుంది. కరివేపాకు క్యాల్షియం పాల కంటే 7 రెట్లు ఎక్కువ కలిగి ఉంటుంది. కరివేపాకు అన్నయ్యకు ముదురు ఆకులను ఉపయోగిస్తారు కానీ వాటిని తీసి పక్కన పడేసాను అది లేత ఆకులతో కలిపి తేనెతో కాబట్టి లేత ఆకులను ఉపయోగించడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కరివేపాకు దూసి తీసుకెళ్లి పోవడం కాకుండా కొమ్మలు విరుస్తూ ఉండటం వలన కొత్త చిగురు వస్తుంది. రెండోది పుదీనా.
మనం పుదీనా మార్కెట్లో తెచ్చుకొని ఆకులు తీసుకున్న తర్వాత కొమ్మలు కొన్ని కుండీలలో గుచ్చడం వలన పెరిగిపోతుంది. పిలకలు కత్తిరించే కొద్ది మళ్లీ మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. కొత్తిమీర కూడా కొన్ని ధనియాలను కుండీలలో చల్లడం ద్వారా వచ్చేస్తుంది. కొబ్బరి పొట్టు, కొంచెం మట్టి ట్రేలలో వేసి ధనియాలు చల్లడం వలన కొత్తిమీర వస్తుంది. కొత్తిమీర కొంచెం ఎదిగిన తర్వాత వాటిని తీసుకొని మళ్ళీ ధనియాలు చల్లితే కొత్త కొత్తిమీర వస్తుంది.
విటమిన్ ఏ పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చర్మసౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తవృద్ధికి, కంటి చూపు మెరుగు పరచడానికి, అలాగే కాల్షియం శరీరానికి కావలసినంత అందించడానికి కొత్తిమీర ఉపయోగపడుతుంది. కట్ చేసి జ్యూస్లు స్నాక్స్ లో వెజిటేబుల్స్ లో పైన చల్లుకొని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మసౌందర్యానికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి.