మన చర్మంలో ముఖం అందరికీ కనిపిస్తూ ఉండే అవయవం. ఈ అవయవం ఎండకి కూడా ఎక్కువగా గురి అవుతూ ఉంటుంది. దీని వల్ల చర్మం నల్లగా మారడం, కాంతిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం రకరకాల క్రీములు వాడి చర్మాన్ని కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఈ క్రీములు ఎంత మేలు చేస్తాయో తెలియదుగానీ మనకు ఎండ నుంచి రావాల్సిన విటమిన్ డి శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి.
దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మన శరీరంలో రక్తప్రసరణ తక్కువగా జరిగే అవయవం మన చర్మం. రక్త ప్రసరణ బాగా జరిగినప్పుడు మన మొఖం సహజ కాంతితో వెలిగిపోతుంది. దాని కోసం మన ఆయుర్వేదంలో చాలా మంచి చిట్కాలు ఉన్నాయి. అందులో ఒకటే మడ్ ప్యాక్ అంటే మీరు అనుకునేదే. మట్టితో వేసే ఈ ప్యాక్ మీ చర్మంలో మృతకణాలను, వ్యర్థాలను తొలగించి రక్తప్రసరణను పెంచి చర్మ కాంతిని పెంచుతుంది.
దాని కోసం మనం ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. మన పల్లెటూర్లలో పొలాల్లో ఉండే మట్టిని తీసుకోవాలి. ఒక అడుగు లోపలికి తీసుకోవడం వల్ల ఎటువంటి రసాయనాలు ఉండవు. ఆ మట్టిని బాగా ఎండబెట్టి చెత్తాచెదారం తీసేసుకోవాలి. ఇలా శుభ్రపరచిన మట్టిని ఏదైనా బండలో లేదా మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వచేసుకొని పెట్టుకోవచ్చు.
తర్వాత ఒక గిన్నెలో మీ చర్మానికి సరిపడా పౌడర్ తీసుకొని అందులో ఈ పౌడర్ కి సరిపడా నీళ్ళు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మీ చర్మానికి మందంగా వేయడం వల్ల మీ చర్మానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. దీని వల్ల మనిషి శరీరానికి కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
లాభాలు:- ఈ మట్టి ప్యాక్ వల్ల చర్మం చాలా చల్లగా అవుతుంది. ఇలా అవడంతో చర్మానికి వెచ్చదనం కోసం శరీరం వెంటనే చర్మానికి రక్త ప్రసరణను ఎక్కువ చేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగేసరికి చర్మంలో ఉండే వ్యర్ధాలు మలినాలు తొలగిపోయి చర్మం స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది.
ఈ ప్యాక్ వల్ల చర్మానికి 60 శాతం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ మెరుగు పడటం వలన చర్మానికి కావలసిన పోషకాలు చక్కగా అందుతాయి. చర్మ కణాలు ఆరోగ్యంగా మారతాయి. చల్లదనం వలన చర్మంలోని కండరాలు కూడా దగ్గరకు వచ్చి చర్మం టైట్ గా అవుతుంది. దీనివలన ముడతలు, మచ్చలు కూడా తొలిగిపోతాయి.
ఈ పాక్‌ను 20 నుండి 30 నిమిషాలు ఆరనివ్వాలి ఈ ప్యాక్ బాగా ఆరిపోయి, పగిలినట్టు అయినప్పుడు నీటితో మసాజ్ చేస్తూ తీసేయాలి. ఇలా రోజూ చేయడం వలన చర్మం కాంతివంతంగా మారడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యం కోసం మనం రోజూ సరిపడా నీళ్లు, వీలైతే రోజుకు రెండు జ్యూస్‌లు తాగడం మంచిది.