100 గ్రాములు చిలకడదుంప ఆకులో 42 క్యాలరీల శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 9 గ్రామ్స్, ప్రోటీన్ 2.5 గ్రామ్స్, ఫ్యాట్ జీరో గ్రామ్స్, ఫైబర్ 5.3 గ్రామ్స్, సూక్ష్మ పోషకాల్లో విటమిన్ సి 11 మిల్లీగ్రామ్స్, పొటాషియం 508 మిల్లీ గ్రాములు, ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది చిలకలడ దుంప ఆకుల్లో లూటిన్, జియోగ్జాన్తిన్ కెమికల్స్ 14720 మైక్రో గ్రాములు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఈ చిలకడదుంప ఆకులో 24 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది తెల్ల రక్త కణాల్లో ఉండే DNA రిపేర్ చేసి, మోడి ఫై చేసి హెల్తీగా ఉండేటట్టు ఈ చిలకడదుంప ఆకులు చేస్తాయి. దానివల్ల ఇమ్యూనిటీ బాగా పెరగడానికి ఈ ఆకు ఉపయోగపడుతుంది.
యాక్టివ్ గా ఇమ్యూనిటీ సెల్స్ పనిచేయడానికి, లింఫోసైట్స్ యొక్క DNA అని కూడా మోడి ఫై చేసి, యాక్టివ్ చేసి చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. రక్తనాళాలకు గోడల్లో కొవ్వు పేరుకోకుండా ఉండడానికి, గుండె రక్తనాళాల్లో ఫ్యాట్ డిపాజిట్ వల్ల హార్ట్ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి చోట్ల కొవ్వు పేరుకోకుండా ఈ చిలకడ దుంప ఆకు 24 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ మరియు లూటిన్, జియోగ్జాన్తిన్ ఇవన్నీ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల కొవ్వు ఆక్సీకరణ చెందకుండా, కొవ్వు పాడైపోకుండా చేస్తుంది. ఈ చిలకడదుంప ఆకుల్లో ఉండే కొన్ని ఫ్లావనాయిడ్స్ లివర్లో సైటో ప్రొటెక్టివ్ ఎంజైమ్స్ ని ఎక్కువ విడుదలయ్యేలా చేస్తుంది.
లివర్ సెల్స్ ని కాపాడడానికి బాగా ఉపయోగపడుతుంది. లివర్ సెల్స్ డ్యామేజ్ అవకుండా ఉండడానికి ఇది బాగా సహాయపడుతుంది. లివర్ సెల్స్ లో ముఖ్యంగా లివర్ సెల్ఫ్ లో చేరే ఫ్రీ రాడికల్స్ లివర్ సెల్స్ ని డామేజ్ చేస్తూ ఉంటాయి. ఈ లివర్ సెల్స్ లో చేరే ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేసే 24 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ సెల్స్ ని కాపాడ్డానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని లివర్ సెల్ కుసించుకుపోకుండా ఉండడానికి, క్యాన్సర్ కణం గా మారకుండా ఉండడానికి ఈ ఆకు బాగా ఉపయోగపడుతుంది. లివర్ సెల్స్ లోను, కుపర్ సెల్స్ లోనూ మేక్రో ఫేస్ కణాలని రక్షించడానికి ఈ చిలకడదుంప బాగా ఉపయోగపడుతుంది.
లివర్ సెల్స్ ని రక్షించడానికి ఈ చిలకడదుంప ఆకులు బాగా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా రక్తనాళాలు గోడల్లో కొవ్వు ఎక్కువ పెరుకుకోకుండా రక్షిస్తున్నాయి.