apanese Secret Most PowerfulNatural Keratin To Frizzy Hair

జపనీస్ పది రూపాయల కెరోటిన్ సీక్రెట్ ఇదే 10000 ఖర్చు పెట్టినా రాని రిజల్ట్ పది రూపాయలతో వస్తుంది

మనం జుట్టు సిల్కీగా అవ్వడం కోసం పార్లర్కి వెళ్లి  కెరోటిన్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే ఎనిమిది నుంచి పదివేల వరకు ఖర్చవుతుంది. కానీ కేవలం పది రూపాయలుతో  ఇంట్లోనే కెరోటిన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీనికోసం మనకు కావలసినది 8 బెండకాయలు మాత్రమే. బెండకాయలతో ఈ ప్యాక్  చేసుకున్నట్లయితే మీ జుట్టు శైనీగా , సిల్కీ గా మారుతుంది. జీవం లేకుండా  ఉన్న జుట్టు పట్టు  కుచ్చు లాగా తయారవుతుంది. ఎనిమిది బెండకాయలు తీసుకుని  శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. 

      తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి  ఒక గిన్నెలోకి గ్లాసు నీళ్లు వేసే స్టవ్ ఆన్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత బెండకాయ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెండకాయ ముక్కలు ఉడికి  తర్వాత దానిలో ఉండే జిగురు బయటకు వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఏదైనా క్లాత్ సహాయంతో బెండకాయ ముక్కలను వడకట్టుకోవాలి. తర్వాత రెండు చెంచాల కార్న్ ఫ్లోర్  ఒక బౌల్లో కలుపుకొని దీనిలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. 

       ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి దగ్గర పడేంతవరకు ఐదు నిమిషాలు పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పదార్థాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక చెంచా ఆముదం వేసి బాగా కలుపుకోవాలి. ఆముదం లేకపోతే బాదం  నూనె లేదా కొబ్బరి నూనె వేసుకోవచ్చు.  ఈ ప్యాక్ డ్రై హెయిర్ లేదా ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. అప్లై  చేసేటప్పుడు జుట్టును చిన్న చిన్న చిన్న  పాయలు లాగా  విడదీసి కుదుళ్ల  నుండి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 

       అప్లై చేసిన తర్వాత 40 నిమిషాల నుండి గంటపాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్  షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సిల్కీగా, మృదువుగా తయారవుతుంది. మనం పార్లర్కి వెళ్లి కెరోటిన్ ట్రీట్మెంట్  తీసుకున్న సరే  అంత మంచి రిజల్ట్ రాదు. ఈ ప్యాక్ అప్లై చేయడానికి ముందు నిర్జీవంగా ఉన్న జుట్టు ఈ పాక్ అప్లై చేయగాన జుట్టు  పట్టుకుచ్చు లాగా అందంగా కనిపిస్తుంది. జుట్టు మీద చెయ్యి పెడితే మృదువుగా అలా  జారిపోతూ  చెయ్యి తీయాలని కూడా అనిపించదు.  పార్లర్కి వెళ్లి 10000 ఖర్చు పెట్టినా రాని రిసల్ట్ కేవలం ఇంట్లోనే పది రూపాయలు తో వస్తుంది.

Leave a Comment

error: Content is protected !!