ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీమైక్రోబయల్ మరియు యాంటీఆక్సిడెంట్ వంటి ఆరోగ్యకరమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల కలిగే అద్భుతమైన ఉపయోగాలు చూడండి.
ఆరోగ్యకరమైన పదార్థాలు అధికంగా ఉంటాయి
సేంద్రీయ, ఫిల్టర్ చేయని ఆపిల్ సైడర్ వెనిగర్ లో ప్రోటీన్లు, ఎంజైములు మరియు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటాయి, ఇందులో చాలా విటమిన్లు లేదా ఖనిజాలను కలిగి, తక్కువ మొత్తంలో పొటాషియంను అందిస్తుంది. మంచి నాణ్యత గల బ్రాండ్లలో కొన్ని అమైనో ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది
సాధారణంగా వినిగర్‌ను వేటినైన శుభ్రపరచడంలో మరియు క్రిమిసంహారక పదార్థంగా, గోరు చుట్టూ, తల్లో పేలు,, మొటిమలు మరియు చెవి ఇన్‌ఫెక్షన్లకు ఔషధంగా ఉపయోగిస్తారు. రెండు వేల సంవత్సరాల క్రితమే గాయాలను శుభ్రం చేయడానికి వెనిగర్ ఉపయోగించారు.
వినిగర్ లోని ఎసిటిక్ ఆమ్లం ఆహారం పాడవకుండా తాజాగా ఉండేలా చేస్తుంది. మరియు ఈకొలి వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఆహారాన్ని ఆక్రమించకుండా మరియు పాడుచేయకుండా చూడటంలో తోడ్పడుతుంది. కరిగించిన ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మానికి ఉపయోగించడం వల్ల మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
ఇన్సులిన్ ను నియంత్రణలో ఉంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచగలుగుతుంది.
డయాబెటిస్ లేనివారు కూడా వారి రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణంగా ఉంచుకోడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అత్యంత ప్రభావవంతమైన మరియు ఆరోగ్యకరమైన మార్గం శుద్ధి చేసిన పిండి పదార్థాలు మరియు చక్కెరను నివారించడం,
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది కడుపు నిండుగా ఉన్నట్టు చేయడం ద్వారా ఆహారం తక్కువగా తీసుకోవడంలో దోహాధం చేస్తుంది.
రక్తంలో చక్కెరలు తగ్గించడం మరియు ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
గుండె జబ్బులు మరణానికి ప్రధాన కారణాలలో ఒకటి. ఆపిల్ సైడర్ వెనిగర్ లో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించే గుణాలు ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాలు గణనీయంగా తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది
పొడి చర్మం మరియు తామర వంటి చర్మ సమస్యలకు ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక సాధారణ నివారణ. ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం వల్ల చర్మం యొక్క సహజ పిహెచ్‌ను తిరిగి సమతుల్యం చేసుకోవచ్చు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను బట్టి, ఆపిల్ సైడర్ వెనిగర్, తామర మరియు ఇతర చర్మ పరిస్థితులతో ముడిపడి ఉన్న చర్మ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. కొంతమంది ఫేస్ వాష్ లేదా టోనర్లో పలుచన ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగిస్తారు. ఇది బ్యాక్టీరియాను చంపి మచ్చలను నివారిస్తుంది.
చివరగా……
ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం వల్ల పైన చెప్పుకున్నా ప్రయోజనాలను పొందడంతో పాటు ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు రక్షించుకోవచ్చు