apricot dry fruit health benefits in telugu

ఈ పండులో పోషకాల గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టరు!!

 ఖుబానికా మీటా చాలా రుచికరమైన తీపి పదార్థం, అంతే కాదు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నుండి వారసత్వంగా వస్తున్న తీపి వంటకం. ఇందులో ఉపయోగించే ఆఫ్రికాట్లు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఒక్కసారి వాటి గూర్చి తెలుసుకున్నారంటే ఆఫ్రికాట్లు ఫారికితే అసలు వదలరు. కావాలంటే మీరే చదవండి. 

విటమిన్ ఎ సమృద్ధిగా కలిగి ఉంటుంది.

 ఆప్రికాట్లు విటమిన్ ఎ తో నిండి ఉంటాయి., దీనిని రెటినాల్ అని కూడా పిలుస్తారు.  ఇది కొవ్వులో కరిగే విటమిన్. కంటి ఆరోగ్యాన్ని మరియు కంటి చూపును మెరుగు పరచడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.  అంతేకాదు ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది కూడా.   రెటినోల్ మరియు బీటా కెరోటిన్ నియోవాస్కులర్ ARMD అని పిలువబడే తీవ్రమైన కంటి-సంబంధిత జబ్బు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. 

  ఫైబర్‌ అధికంగా ఉంటుంది.

 మీరు ఎండిన లేదా తాజాగా ఉన్న ఆఫ్రికాట్ లను తింటే, వాటి నుండి ఫైబర్ అధికంగా పొందవచ్చు. ముఖ్యమైన పోషకాలు సులభంగా గ్రహించబడంలో తోడ్పడుతుంది.  మరియు ఇది కొవ్వు ఆమ్లాలను వేగంగా విచ్ఛిన్నం చేస్తుంది, అంటే  జీర్ణక్రియ సరైన క్రమంలో ఉంటుంది.  అంతే కాదు, క్రమం తప్పకుండా పేగులను శుభ్రపరచడం ద్వారా జీర్ణశయాంతర సమస్యల నుండి ఈ పండు రక్షిస్తుంది.

 హృదయానికి ఆరోగ్యానికి  మంచిది

 పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్నందున, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కంటెంట్‌ను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  మరియు మీ గుండె రక్షించబడుతుంది.  అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.  వీటిలోని పొటాషియం కంటెంట్ మన వ్యవస్థలోని ఎలక్ట్రోలైట్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది, మన గుండె కండరాలను క్రమంగా ఉంచుతుంది.  ప్రతిరోజూ ఒకటి లేదా రెండు తాజా ఆప్రికాట్లు లేదా కొన్ని ఎండిన వాటిని తినడం వల్ల గొప్ప ప్రయోజనం పొందవచ్చు.

 పండిన ఆప్రికాట్లు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల  కాలక్రమేణా మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను వదిలించుకోవడానికి ఇది శరీరానికి గొప్పగా  సహాయపడుతుంది.  యాంటీఆక్సిడెంట్లు మన కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను కూడా చంపుతాయి.

రక్తహీనతను నివారిస్తుంది

 రక్తహీనతను నివారించడంలో ఐరన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆఫ్రికాట్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అనిమియా తో బాధపడే వారు ఆఫ్రికాట్లను తరచుగా తీసుకోవడం వల్ల లోపించిన రక్తం స్థాయిలను తిరిగి భర్తీ చేస్తుంది.  వీటితో పాటు విటమిన్ సి సమృద్ధిగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ఉత్తమం. 

చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది

 విటమిన్ సి, ఎ, ఫైటోన్యూట్రియెంట్స్ కలయిక మంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆఫ్రికాట్ పండులోని యాంటీఆక్సిడెంట్లు కూడా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్థాయి.వయసు పెరిగినా యవ్వనంగా ఉండాలని కోరుకునే వారు మంచి డైట్ మాత్రమే కాకుండా  కాబట్టి మంచి ప్రతిరోజూ కొన్ని ఆప్రికాట్లు తినడం గొప్ప పలితాన్ని ఇస్తుంది.

ఇది డైట్ ఫ్రెండ్లీ

 పండ్లలోని ఫైబర్  జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఇది జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే సంతృప్తి భావనను ఎక్కువ సేపు ఉంచుతుంది. ఆకలిని దరిచేరనివ్వదు. తద్వారా బరువు తగ్గాలని అనుకునేవారికి ఎంతగానో సహాయపడుతుంది.   అయితే,  ఎండిన ఆఫ్రికాట్లు తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకోవడం మర్చిపోకండి.  ఎండిన పండ్లలో ఎక్కువ చక్కెర ఉంటుంది, ఇది దంత ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

ఎముకలను బలోపేతం చేస్తుంది

 ఎముకలు ఏర్పడటానికి మరియు అభివృద్ధి చెందడానికి కాల్షియం చాలా అవసరం,  శరీరంలో తగినంత పొటాషియం లేకుండా, కాల్షియం గ్రహించబడదు. అయితే కాల్షియం మరియు పొటాషియం రెండిటి కలయిక అయిన ఆఫ్రికాట్లు తినడం వల్ల సమర్థవంతమైన ఎముక ఆరోగ్యం చేకూరుతుంది.

చివరగా…..

ఆఫ్రికాట్లు చాలా అరుదుగా లభించినటప్పటికి వీటిలో ఉన్న పోషకాలు మరియు కలిగే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా దొరికితే వదలకండి.

Leave a Comment

error: Content is protected !!