అందరూ తినగలిగే పండు అరటి. సీజన్ ఏదైనా, పండుగలు పబ్బలు మాత్రమే కాదు సాధారణ సమయంలో కూడా కొంటుంటాం, తింటుంటాం. సామాన్యుడు కూడా కొనగలిగే పండు, కడుపు నింపే పండు, జీర్ణశక్తికి దోహాధం చేసే పండు, ఎన్నని చెప్పాలి అరటి గూర్చి. అయితే అరటి కేవలం పండు మాత్రమే కాదండోయ్ మన శరీరానికి గొప్ప ఔషధం కూడా. నమ్మరా?? అయితే ఒకసారి ఈ అరటి కథాకమామీషు చదవండి. అరటి పండుతో కలిగే బోలెడు ప్రయోజనాలు చూస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం.
◆లేత అరటికాయను చిన్న చక్రాలుగా తరిగి ఎండబెట్టి చూర్ణం చేసుకుని బెల్లపు పాకంలో కానీ, లేదా తేనె లేదా పంచదార లో కలుపుకుని తింటే అమీబియాసిస్ వ్యాధిలో జిగురు విరేచనాలు, రక్తం పడటం వంటివి ఆగిపోతాయి.
◆ముదిరిన అరటిపండును ముక్కలుగా కోసి ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. దీన్ని రోజూ తీసుకుంటే హెర్నియా తగ్గుతుంది.
◆అరటి చూర్ణం వదులైన గర్భాశయ కండరాలను సరిచేస్తుంది. కాబట్టి ప్రసవం తరువాత గర్భాశయ కండరాల దృఢత్వం కోసం అరటి చూర్ణం తీసుకోవచ్చు.( ప్రసవం అయిన వెంటనే కాదు గమనించగలరు)
◆కూర అరటికాయలు ఎండబెట్టి పొడి చేసి నిల్వచేసుకోవాలి. దీన్ని రోజూ తీసుకుంటే స్త్రీలలో కుసుమ వ్యాధులు, గర్భాశయ వ్యాధులు, ముఖ్యంగా తెల్లబట్ట వ్యాధిలో బాగా ఉపయోగపడుతుంది.
◆మగ్గిపోయిన అరటిపండు మలబద్దకాన్ని పోగొట్టి, విరేచనాన్ని సాఫీగా జరిగేలా చేస్తుంది. రక్త విరేచనాలు, జిగురు విరేచనాలు, అమీబియాసిస్ వ్యాధి ఉన్నవారు మగ్గిన అరటిపళ్లను విరివిగా తీసుకోవడం ఉత్తమం.
◆అరటి ఆకులలో వేడివేడి అన్నం వడ్డించుకుని తింటే మూత్ర వ్యాధులన్నింటికి మంచిది. రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా అరటి ఆకు భోజనం వల్ల గొప్ప పలితాన్ని చూడవచ్చు.
◆బిపి కి అరటిపళ్ళు బాగా పనిచేస్తాయి. గనేరియా, సిఫిలిస్ తదితర సుఖవ్యాధులలో మూత్రం మంటగా వెళ్తున్నపుడు అరటిపండ్లను ఎండించి దంచి మూడు నాలుగు చెంచాల పొడికి రెండు గ్లాసుల నీళ్లు పోసి నాలుగో వంతు మిగులెలా మరిగించి వడకట్టుకుని అందులో బెల్లం లేదా తేనె లేదా పంచదార ఎదో ఒకటి కలిపి తాగుతూ ఉంటే మూత్ర సంబంధ వ్యాధులన్నీ తగ్గిపోతాయి.
◆అరటిపండును అనీమియా తో బాధపడుతున్న వారు ఎక్కువగా తీసుకుంటే మంచిది. అంతే కాదు అరటిపండును రోజూ తీసుకుని గ్లాసుడు పాలలో తేనె కలుపుకుని తాగుతూ ఉంటే బక్కపలుచని దేహం కూడా లావుగా మారుతుంది.
◆క్రీడాకారులు, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఆదటిపండును క్రమం తప్పకుండా తీసుకోవడం ఉత్తమం.
చివరగా…..
అరటిపండును పైన చెప్పుకున్న విధంగా వాడితే గొప్ప పలితాలు పొందడమే కాకుండా ఇతర రాష్ట్రాలలో పచ్చి అరటిని అవపెట్టి మసాలా జోడించి చిరుతిండిగా తయారుచేసుకుని కూడా తింటారు. కాబట్టి ఆరోగ్యానికి అరటి అనే మాటను మారువకుండా అందుబాటులో ఉన్నపుడు తప్పక అరటిని తినండి.