arthritis-ayurvedic-simple-home-remedy

10 రూపాయిల ఖర్చుతో మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు అన్ని మాయం…జీవితంలో అసలు ఉండవు

కీళ్ళనొప్పులు వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. కీళ్ళమధ్యలో గుజ్జు అరిగిపోవడం లేదా గాలి చొరబడటం వలన మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు వచ్చాయంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే ఈ చిట్కాలు రాత్రి పూట పాటిస్తే కీళ్ళనొప్పులు నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ళనొప్పులు ప్రారంభ దశలో ఉంటే ఈ చిట్కాలు పాటించవచ్చు.  అదే తీవ్రంగా ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి. సరైన సూచనలు పాటిస్తే ప్రారంభదశలో తగ్గించుకోవచ్చు. 

దీనికోసం ఆవనూనె తీసుకోవాలి. ఒకస్పూన్ ఆవనూనె తీసుకోవాలి. దీంట్లో సిలీనియం సమృద్ధిగా ఉంటుంది. భుజాలు, నడుం నొప్పులకు ఈ నూనెతో మసాజ్ చేస్తే  ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరమంతా ఆవనూనె రాసినపుడు రక్తప్రవాహం లేదా రక్తప్రసరణ మెరుగుపడి కీళ్ళనొప్పులు మరియు ఆర్థరైటిస్ తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో కీళ్ళనొప్పులు, మోకాళ్ళనొప్పులకు చికిత్సగా  ఉపయోగిస్తారు. ఆవనూనెలో ఒమేగా త్రీ, ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.

 ఆవనూనెలో కీళ్ళ ధృడత్వం పెంచే లక్షణాలు అధికం. ఈ నూనెలో ఒక స్పూన్ సొంఠిపొడి వేసుకోవాలి. సొంఠిపొడి కూడా కీళ్ళనొప్పులు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. సొంఠిపొడి లో కూడా యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. మోకాళ్ళనొప్పులు, ఆర్థరైటిస్, కండరాల ఒత్తిడి, గాయాలను తగ్గిస్తుంది. సొంఠిలో ఉండే రోగనిరోధక శక్తి సమ్మేళనాలు మోకాళ్ళనొప్పి, వాపులు తగ్గించడానికి సహాయపడతాయి. నొప్పి ఉన్నచోట ఈ మిశ్రమాన్ని రాసి టవల్ లేదా వస్త్రంతో కప్పాలి. రాత్రంతా అలా వదిలేయాలి. 

గోరువెచ్చని నీటితో ఈ ప్రదేశాన్ని కడిగేయాలి. అప్పుడు వాపు, నొప్పి తగ్గిపోతాయి. పదిరోజులపాటు ఈ మిశ్రమాన్ని వాడడంవలన ఉపశమనం లభిస్తుంది. 

ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని మోకాళ్ళనొప్పులు తగ్గడంలోనూ, కీళ్ళనొప్పులు తగ్గడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. రెండింటిలోనూ రోగనిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. శొంఠిపొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగడంవలన కూడా నొప్పులు తగ్గుతాయి. శొంఠిపొడి నొప్పులను తగ్గించడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాల ఉంటాయి. 

పెద్దలు అందుకే అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో శొంఠిపొడిని కలిపి తినమని చెప్తారు. అలా తింటే అజీర్తి‌, గ్యాస్ వంటి సమస్యలు ఉండవని చెప్తారు. ఆకలి లేని వారికి ఆకలి పుట్టిస్తుంది. అజీర్ణం తో బాధపడేవారికి కూడా బాగా పనిచేస్తుంది. అధికకొవ్వు సమస్యను తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. దగ్గు,జలుబు ఉన్నప్పుడు పాలల్లో లేదా టీలో చెంచా శొంఠిపొడి కలిపి తాగడంవలన అజీర్తి‌ తగ్గుతుంది. 

లవంగాల పొడి, శొంఠిపొడిరెండు కలిపి నీటిలో వేసి మరిగించి తాగినా దగ్గునుండి ఉపశమనం కలుగుతుంది. అధికబరువు సమస్య ఉన్నవారు పరగడుపున వేడినీటిలో శొంఠిపొడి కలిపి తాగితే బరవు తగ్గవచ్చు. గోరువెచ్చని పాలల్లో కలిపి తాగితే మూత్రసంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. 

1 thought on “10 రూపాయిల ఖర్చుతో మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు అన్ని మాయం…జీవితంలో అసలు ఉండవు”

  1. చాలా ఉపయోగకరంగా వుంది ఆరొగ్య చిట్కాలు

    Reply

Leave a Comment

error: Content is protected !!