arthritis home remedies in telugu

కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా?? మరేం భయపడకండి, ఇవి పాటిస్తే సమస్య తొలగిపోవడం ఖాయం.

మన శరీరం వయసు పెరిగే కొద్ది కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మాన్ ఆరోగ్యాన్ని బట్టే శారీరక సామర్థ్యము కూడా దృడంగా ఉంటుందా లేక బలహీనంగా ఉంటుందా అనేది నిర్ణయించబడుతుంది. ఒక యంత్రం దీర్ఘ కాలం పని చేసేకొద్ది మెల్లిగా అందులో పరికరాలు అరిగిపోతూ పనిచేయడంలో సమస్యలు సృష్టిస్తుంది. అలాగే మనిషి శరీరంలో కూడా వయసు పెరిగేకొద్దీ శరీరంలో ఎముకలు అరిగిపోవడం, బాక్టీరియా, వైరస్  ఇన్ఫెక్షన్ లకు గురికావడం, జీర్ణక్రియ మందగించడం, శరీరంలో హార్మోనుల అసమతుల్యత, రోగనిరోధకశక్తి మందగించి  తొందరగా అనారోగ్యాలకు గురికావడం. అధిక బరువు, అనుకోకుండా సంభవించే ప్రమాదాల వల్ల శరీరం పట్టుత్వాన్ని కోల్పోవడం వంటివెన్నో మన శరీరాన్ని చుట్టుముడుతూ ఉంటాయి. 

ముఖ్యంగా వయసు పెరగడం, అధిక బరువు అనే రెండు కారణాల వలన శరీరంలో కీళ్ల నొప్పులు వస్తుంటాయి. పరిశీలిస్తే మగవాళ్ల కంటే ఆడవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కూడా ఉంటుంది కారణం కాల్షియం నుండి ఎన్నో పోషకాల లోపం మరియు బలహీనత, అధిక బరువు కూడా. అయితే ఇంతగా ఇబ్బంది పెట్టే కీళ్ల నొప్పుల గూర్చి భయపడవలసిన అవసరం లేదు. కీళ్ల నొప్పులను తగ్గించే అద్భుతమైన కొన్ని చిట్కాలు పాటిస్తే పలితాన్ని చూసి పక్కా ఆశ్చర్యపోతారు.  మరి అవేంటో చూడండి.

◆ వంద గ్రాముల వెల్లుల్లి పాయల్ని దంచి చిక్కటి రసం పిండాలి. మరో వంద గ్రాముల వెల్లుల్లిని మెత్తగా దంచి ఈ రసంలో కలుపుకోవాలి. దీంట్లో నెయ్యి కానీ, నూనె కానీ వంద గ్రాములు వేసి బాగా కలిపి  రసం ఇగిరిపోయేవరకు మరిగించాలి. ఇపుడు వెల్లుల్లి గుజ్జును మెత్తగా నూరి నూనెతో పాటు ఒక గాజు సీసాలో నిల్వచేసుకోవాలి. దీన్ని రోజు బోజనంలో మొదటగా గుప్పెడు అన్నంలో కాసింత కలుపుకుని తినాలి. తరువాత సాధారణ కూరలతో తినవచ్చు. ఇలా చేయడం వల్ల  కీళ్ల వాతం మరియు పక్షవాతం సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.

◆ పిప్పిలి, మోడి, శొంఠి సమాన భాగాలుగా ( ఒక్కొక్కటి 50 గ్రాముల మోతాదు) తీసుకోవాలి. ఇవన్నీ ఆయుర్వేద దినుసులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. వీటిని విడివిడిగా నేతిలో వేయించి మెత్తగా దంచి, జల్లించాలి.  ఇందులో 400 గ్రాముల పెరుగు, 400 గ్రాముల నువ్వుల నూనె కలిపి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. నూనె మాత్రం మిగిలిన తరువాత దీనిని గుడ్డలో వడగట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను కీళ్ల నొప్పులు ఉన్న ప్రాంతంలో మెల్లిగా మర్దనా చేస్తుంటే ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా కాళ్ళు పట్టుకుపోవడం, తొడలు బిగుసుకుపోవడం వంటివి తగ్గుతాయి.

◆ అన్నం వండేటపుడు వృధాగా పారేసె గంజి గూర్చి అందరికి తెలిసినదే అయితే ఆ గంజిని ఒక గ్లాసుడు మోతాదులో తీసుకొని ఒక చెంచా శొంఠి పొడి, తగినంత ఉప్పు కానీ పంచదార కానీ కలుపుకుని త్రాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

◆మహాయోగ రాజగుగ్గులు వాతగజాంకుశం వంటి మందులు వ్యాధి తీవ్రతను బట్టి వాడుకోవచ్చు. ఇవి ఆయుర్వేద మందుల షాపులలో దొరుకుతాయి.

◆ శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు మూడింటిని త్రికటుచూర్ణం పేరుతో ఆయుర్వేద మందుల షాపులో అమ్ముతారు. దీనిని అర చెంచా నుండి చెంచా వరకు  తీసుకుని తగినంత ఉప్పు వేసి పెరుగులో కలువుకుని తినాలి. వాతం నొప్పులు, మోకాళ్ళ నొప్పి, నడుం నొప్పికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

◆ మహామహాతైలం, శ్రీరజలా తైలం, విముష్ఠితైలం, ధన్వంతరి తైలం వంటివి కీళ్ల నొప్పులు ఉన్న ప్రాంతాల్లో మర్దనా చేస్తే నొప్పి వాపు తగ్గుతాయి.

చివరగా…..

కీళ్లనొప్పులకు ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవన శైలి కూడా ముఖ్యమైనదే కాబట్టి పైన చిట్కాలు పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలి ని కొంసాగించడం ప్రధానం.

Leave a Comment

error: Content is protected !!