arthritis home remedy with raisins

3రోజులు-శారీరక బలహీనత,రక్తహీనత కీళ్ళనొప్పులు లేకుండా 65ఏళ్ళు వయసులో కూడా 25ఏళ్ళ చురుకుదనం

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. బలహీనత, అలసట ,చురుకుదనం లేకపోవడం ముఖ్యంగా కాల్షియం లోపం తో బాధపడుతున్నారు. 50 నుంచి 60 సంవత్సరాలు వచ్చాక ఇవన్నీ వచ్చేవి కానీ ప్రస్తుతం మారిన రోజులు చాలా చిన్న వయసులోనే అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి.

 ఈ లోపాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.ఈరోజు కాల్షియం లోపాన్ని సరి చేయడానికి పాలు తయారు చేసుకుంటున్నాం. దీని కోసం మనం మూడు పదార్థాలు ఉపయోగిస్తున్నాం. ఈ పదార్థాలన్నీ దాదాపు అందరి ఇళ్లలోనూ ఉండేవే. మనం కొంచెం శ్రద్ధ పెడితే ఈజీగా తయారు చేసుకోవచ్చు.

 దీనికోసం మనం కిస్మిస్ లేదా ఎండు నల్ల ద్రాక్ష తీసుకోవాలి. ఒకప్పుడు ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు ఆన్లైన్ షాపులు, సూపర్ బజార్లు అందుబాటులోకి వచ్చాక అన్ని అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో క్యాల్షియం, పొటాషియం, సమృద్ధిగా ఉంటుంది. 

నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గించడమే కాకుండా పొట్టకు సంబంధించిన అనేక వ్యాధులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. కంటిచూపు మెరుగుదలకు సహాయపడుతుంద. ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉండడంతో రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది.

 తర్వాత మనకు కావాల్సిన వాల్ నట్స్. వాల్నట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా పెడుతుంది. ఇది కొంచెం ఖరీదైనా శరీరానికి కావాల్సిన అనేక లాభాలను అందిస్తుంది. 10 ఎండు ద్రాక్ష, కొన్ని వాల్ నట్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి. వీటిని బాగా మరిగించాలి. ఇవి బాగా మరిగాక ఇందులో వాల్ నట్స్, ఎండుద్రాక్ష వేసుకోవాలి. 

పాల ద్వారా కూడా కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. వీరిలో పటిక బెల్లం వేసుకోవాలి. పటిక బెల్లంలో ఎసెన్సియల్స్, మినరల్స్, విటమిన్స్, పుష్కలంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు నీరసంగా ఉంటుంది. అప్పుడు తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఈ పాలను బ్రేక్ఫాస్ట్ కు ముందు లేదా రాత్రి పడుకోవడానికి ముందు తాగవచ్చు.

 మీ వీలునుబట్టి ఉదయం సాయంత్రం ఎప్పుడైనా తీసుకోవచ్చు. బరువు తగ్గాలి అనుకునేవారు ఆవుపాలు లేదా కొవ్వు తక్కువగా ఉన్న పాలు తీసుకోవాలి. బరువు పెరగాలి అనుకున్నవాళ్ళు పూర్తి కొవ్వు ఉన్న పాలు ఉపయోగించవచ్చు. ఉదయాన్నే ఈ పాలను తీసుకోవడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పాలను తీసుకోవడం వల్ల శరీరానికి చల్లబరచడానికి కూడా సహాయపడతాయి. 

ఈ పదార్థాలన్నీ సహజసిద్ధమైనవే కనుక  ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ పాలను ఇలా వారానికి మూడు సార్లు అయినా తీసుకుంటూ ఉంటే శరీరంలో కాల్షియం లోపం అనేది తగ్గిపోతుంది. శారీరక బలహీనత, అలసట తగ్గి కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటే దానికి బదులు దీన్ని అలవాటు చేసుకోవడం మంచిది. ఈ పాలను తాగిన తర్వాత అరగంట తర్వాత మాత్రమే ఏదైనా తినాలి లేదా తాగాలి. కాకపోతే కొంచెం సమయం తీసుకొని పాలను తయారు చేసుకొని తాగడం వల్ల శారీరక బలహీనత తగ్గిపోతుంది.

Leave a Comment

error: Content is protected !!