ఈ రోజుల్లో కీళ్ళనొప్పులు, నడుంనొప్పి, కాళ్ళనొప్పులు అందరనీ ఎక్కువగా వేధిస్తున్న సమస్య. కొందరికి మాత్రం ఒకకాలు ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది. దీనికి కారణం న్యూట్రియంట్స్, విటమిన్ల లోపం. ఒకేచోట కూర్చుని పనిచేయడం వలన కూడా వెన్ను , కీళ్ళనొప్పులు తీవ్రమవుతాయి. ఈ నొప్పులు తక్కువగా ఉంటే వాటికవే తగ్గిపోతాయి.
కానీ ఈ నొప్పి ఎక్కువగా వస్తుంటే సాధారణ పనులు చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ నొప్పులను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ నొప్పులు పెరిగేకొద్దీ ఎన్నో అనారోగ్య సమస్యలు పెరిగి జీవితంలో ఇబ్బందులుకు దారితీస్తుంది. వీటిని తగ్గించడానికి రెండు ఆయుర్వేద చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో ఒకటి శరీరం లోపలి నుండి నొప్పులను తగ్గించేలా పని చేస్తుంది. మరొకటి శరీరం బయట నుంచి నొప్పులను తగ్గిస్తుంది. ఇలాంటి సమస్యతో బాధపడే వారు ఈ ఇంటి చిట్కాలు తప్పకుండి పాటించాలి. ఈ చిట్కా తయారుచేసుకోవడానికి మనకు కావలసింది 5 డ్రై ప్లమ్స్ అంటే ఆల్ బుకరా పండ్లు ఎండినవి తీసుకోవాలి.
ఏదైనా డ్రై ఫ్రూట్ షాపుల్లో లేదా ఆన్లైన్ షాప్ లో కూడా ఇప్పుడు అన్నిరకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయి. వీటివలన ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులో ఫ్లవనాయిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలలో బలహీనతను తగ్గిస్తాయి..
ఈ డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో మలబద్దకం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. మరొక పదార్థం డ్రై ఆఫ్రికాట్. వీటిని తెలుగులో జలధార లేదా పొడి నేరేడు పండు(డ్రై బెర్రీస్) అని కూడా అంటారు. ఇది కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి.
ఆప్రికాట్లో యాంటీఆక్సిడెంట్స్ , ఫైబర్ ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. కంటిచూపును కూడా పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా దోహదపడతాయి. చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా ఆప్రికాట్స్ ఉపయోగపడతాయి. తర్వాత అంజీరా పండ్లను రెండు, మూడు తీసుకోవాలి. ఇవి కూడా శరీరంలో శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
ఇప్పుడు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో నొప్పులు తగ్గించడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతాయి. వీటిని రోజూ బాగా నమిలి తినేయాలి. రోజు పడుకునే ముందు లేదా ఉదయాన్నే టిఫిన్ తినడానికి కనీసం అరగంట ముందు వీటిని తినాలి.
వీటి వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇప్పుడు రెండో చిట్కా కోసం మనకి కావలసింది ఆవ తెలగ పిండి. దీనిని ఆవచెక్క అనికూడా అంటారు. ఇది కూడా ఆయుర్వేద షాపుల్లో ఆన్లైన్ సైట్స్ ఉంటుంది. తర్వాత కావలసింది స్వచ్ఛమైన పసుపు.
ఆవనూనె కూడా కావాలి. గిన్నెలో రెండొందల గ్రాముల నూనె తీసుకుని అందులో ముందుగా ఆవచెక్కని రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి మెత్తగా ఉన్న ఈ ఆవ చెక్కని నూనె వేడెక్కాక అందులో ఈ పిండి వేయాలి. తర్వాత పావుస్పూన్ పసుపు కూడా వేసి ఉడికించాలి. ఇది హల్వాలా కొంచెం ఉడికి దగ్గరపడ్డాక స్టవ్ ఆపేయాలి.
ఈ పేస్ట్ ను రెండు విధాలుగా వాడవచ్చు. ఒక గుడ్డలో ఈ పేస్ట్ కట్టి కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడు నొప్పి ఉన్నచోట కాపడం పెట్టుకోవచ్చు. రెండోది నొప్పి ఉన్న చోట ఈ పేస్ట్ని పైపూతగా పూసి ఏదైనా గుడ్డతో పైన కట్టుకట్టాలి. ఈ పేస్ట్ ఒక్కసారి తయారుచేసుకొని వారం వరకు నొప్పులకు వాడుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా ఆప్రికాట్, ప్లమ్, అంజీర్ తింటూ ఆవపిండి ఉపయోగించడం వలన నొప్పులు త్వరగా తగ్గిపోతాయి.