నడుం, వెన్ను, కీళ్ళనొప్పులు తగ్గించే ఆయుర్వేద చిట్కా గురించి తెలుసుకుందాం. ఈ చిట్కా తో ఎలాంటి నొప్పులనుండైనా ఉపశమనం పొందొచ్చు. ఒక గిన్నె తీసుకుని స్టౌ మీద పెట్టుకోండీ. దానిలో ఆవనూనె వేసుకుని వెల్లుల్లిని పొట్టు తీసుకుని ఐదు వెల్లుల్లి రేకులను వేయించుకోవాలి. ఒక అంగుళం అల్లంముక్క తీసుకుని పైన పొట్టు తీసేసి ముక్కలుగా తరిగి నూనెలో వేసుకోవాలి. అలాగే పది లేదా పదకొండు మిరియాలు వేయండి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
ఐదునుండి ఏడు నిమిషాలు వీటన్నింటిని సన్నని మంటపై వేడిచేయాలి. వీటన్నింటిని ఔషధగుణాలు ఈ నూనెలోకి దిగిన తర్వాత వెల్లుల్లి అల్లం రంగు మారాక వడకట్టు సహాయంతో నూనెను వేరు చేయండి. ఈ నూనెను ఎయిర్ టైట్ కంటెయినర్లో నెలవరకూ నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను తీసుకుని మీకు ఏ ప్రదేశంలో నొప్పిగా ఉందో అక్కడ కనీసం పదిహేను నిమిషాలు మసాజ్ చేయాలి.
ఈ మసాజ్ వలన నొప్పులు, వాపులు తగ్గడంతో పాటు ఆ ప్రదేశంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపసరణ వేగవంతం అవడంవలన నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. రక్తనాళాల్లో అడ్డంకులు ఉండడంవలనే వాపులు నొప్పులు ఏర్పడతాయి. నరాల బలహీనత కూడా వీటివలనే వస్తుంది. అందుకే ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్నచోట ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం మూడుసార్లు ఉపయోగించి చూడండి.
దీనిని రోజూ వాడినా ఎటువంటి దుష్ప్రభవాలు ఉండవు. ఆవనూనె శరీరంలో వేడిని కలిగించి నొప్పులనుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం వెల్లుల్లికి నొప్పులను తగ్గించే లక్షణం ఉంటుంది. ఈ చిట్కాతో పాటు ఇలాంటి కీళ్ళనొప్పులకు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం అవసరం. సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు తినాలి. క్యాబేజీ, ముల్లంగిబ్రొకోలి కాలీఫ్లవర్ అధికంగా తీసుకుంటూ ఉండాలి.
అలాగే ఆహరంలో వెల్లుల్లిని అల్లాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్, మసాలాలు, పాలిష్డ్ బియ్యం, నిల్వ పదార్థాలు తగ్గించాలి. కాఫీ టీలకు దూరంగా ఉంటే మంచిది. చికెన్, మటన్ వారానికి రెండుసార్లు చేపలు మూడుసార్లు తీసుకోవచ్చు. అలాగే ఉదయాన్నే వెల్లుల్లిని ఆహారం లో తీసుకోవడం వలన కీళ్ళు,వెన్ను నొప్పులు తగ్గుతాయి. సరైన వ్యాయామంతో పాటు మంచినీటిని కూడా ఎక్కువ తీసుకోవాలి.