At what age hair growth stops in female

ఏడు రోజుల్లో ఫాస్ట్ హెయిర్ గ్రోత్….. కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే చాలు…… ఒక వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు వస్తాయి……..

ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. వర్షాకాలంలో సాధారణంగా కంటే  జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా దురద, చుండ్రు వంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఇప్పుడు మనం తయారు చేసుకునే రెమిడి వలన జుట్టు రాలే సమస్య నుంచి విడుదల పొందడమే కాకుండా దురద మరియు చుండ్రు నుంచి కూడా విడుదల అందిస్తుంది. ఇందులో ఉపయోగించేవి అన్నీ మన ఇంట్లో లభిస్తూ ఉంటాయి. అందువలన దీనిని చిన్నవారి నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు.

అంతేకాకుండా దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు ఈ రెమెడీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ముందుగా కలోంజీ విత్తనాలు. ఇవి మనకు ఆన్లైన్లోనే, ఆయుర్వేద దుకాణాలలోని ఎక్కువగా లభిస్తాయి.  వీటిని ఉపయోగించడం వలన మన జుట్టు ఎదుగుదల మెరుగుపడుతుంది. రెండవదిగా మనకు కావాల్సింది మెంతులు. మెంతులు మన జుట్టుకు ఒక కండిషనర్ లాగా పని చేస్తాయి. అంతేకాకుండా చుండ్రు దురద వంటి సమస్య నుంచి విడుదల అందిస్తుంది. మూడవదిగా మనకు కావాల్సింది నల్ల మిరియాలు. ఇది కూడా మన ఇంట్లో లభిస్తాయి. 

ఇవి జుట్టు ఎదుగుదల సహాయపడతాయి. ఇప్పుడు ఈ రెమిడి తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ కలోంజి విత్తనాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తని పొడి లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని తీసుకొని స్టవ్ పై పెట్టుకొని నీటిని బాగా మరగనివ్వాలి. ఈ లోపు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో మనం జుట్టుకు సరిపడినంత కోబ్బరి నూనె పోసుకోవాలి. అందులో ఒక స్పూన్ మనం తయారు చేసుకున్న పొడిని వేసుకుని ఆ చిన్న గిన్నెను బాగా మరిగిన నీటిలో పెట్టి డబల్ బాయిలింగ్ ప్రాసెస్ లో నూనెని బాగా మరగనివ్వాలి. 

ఇలా మరిగిన తర్వాత నూనె రంగు మారుతుంది. తర్వాత స్టవ్ ఆపి నూనె గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఆ నూనెను మన జుట్టు యొక్క కుదుళ్ల నుంచి చిగుళ్ల వరకు పాయలు పాయలుగా తీసుకుని అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక రెండు గంటలసేపు ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయవచ్చు. లేదా ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి…..

Leave a Comment

error: Content is protected !!