Atibala plant Abutilon indicum health benefits

100కు పైగా రోగాలను తగ్గించే ఈ మొక్క గురించి అసలు విషయాలు మీకు తెలుసా ?

హలో ఫ్రెండ్స్.. ఈ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. అవి మన చుట్టూనే ఉన్న వాటిని పట్టించుకోకుండా ప్రతి చిన్నదానికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం. మనం పిచ్చి మొక్కలు అనుకునేది ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. ఈ కోవకు చెందిన మొక్కే అతిబల. పల్లెటూర్లలో రోడ్డుకు ఇరువైపులా  లోపలికి ఇరువైపులా ఖాళీ ప్రదేశాలలో ఎక్కడపడితే అక్కడ విరివిగా కనిపించే అతిబల మొక్కను  ప్రాంతాలను బట్టి తుత్తిర బెండ, దువ్వెన కాయ చెట్టు ముద్ర బెండ అని రకరకాల పేర్లతో పిలుస్తారు.

మాల్వేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క యొక్క వృక్ష శాస్త్రీయ నామం Abutilon indicum. పోయిన శక్తిని తిరిగి రప్పించే శక్తి ఈ మొక్కకు ఉంది. ద్వాపరయుగంలో దుర్యోధనున్ని అతి బలవంతుడిగా చేయుటకు గాంధారి ఈ చెట్టును ఉపయోగించి ఉందని చెబుతారు. దీని ఔషధ గుణాల విషయానికి వస్తే దీని ఆకులలో యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కీళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటే ముద్ర బెండ ఆకులను వేడి చేసి కొంచెం వెన్న పూసి నొప్పులున్నచోట కట్టు కడుతూ ఉంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే దీని ఆకుల పసరు ఆవనూనెలో  పోసి నూనె మిగిలే వరకు వేడి చేసి భద్రపరచుకుని నొప్పులున్నచోట పై పూతగా పూస్తే చక్కటి ఉపశమనం కలుగుతుంది.

అతిబల ఆకుల కషాయంలో కండ చక్కెర కలిపి తాగుతూ ఉంటే గుండె దడ ఆయాసం తగ్గిపోతాయి. పిప్పి పళ్ళు చిగుళ్ళ వాపు నోటి నుండి దుర్వాసన రావడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆరు అతిబల ఆకులను శుభ్రంగా కడిగి రసం తీసి ఆ రసంతో మూడు రోజులపాటు పుక్కిట పడితే దంత సమస్యలు తొలగిపోతాయి. గాయాలు అయినప్పుడు దీని ఆకులను పసుపు కలిపి మెత్తగా నూరి గాయం ఉన్నచోట పై పూతగా పూస్తే త్వరగా గాయాలు మానిపోతాయి.

నడుము నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు అతిబల ఆకులను ఉడికించి ముద్దగా చేసుకుని నడుము దగ్గర కట్టు కట్టాలి ఇలా క్రమం తప్పకుండా వారంరోజులపాటు చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది.

అతిబల వేరును తీసుకొని దానిని ఆవు పాలలో వేసి మరిగించి వడగట్టి దానిలో కొంచెం కండ చక్కెర వేసుకొని రాత్రి పడుకునే ముందు తాగుతూఉంటే శీఘ్రస్కలన సమస్య దూరమయ్యి  శృంగార సామర్థ్యం పెరుగుతుంది. స్త్రీలకు స్తనాల వాపు ఇబ్బంది పెడుతూ ఉంటే అతిబల వేరును సేకరించి మంచి నీటితో సానపైన నూరి గంధం తీసి దానిని స్థానాల పైన లేపనంగా పూస్తే వాపు తగ్గిపోతుంది.

కుక్క కరిచినప్పుడు అతిబల ఆకుల రసాన్ని 60 ml మోతాదులో కరిచిన వ్యక్తికి తాగించి ఆకులను నూరి కుక్క కరిచిన చోట కట్టు కట్టాలి ఇలా చేయడం వలన విష ప్రభావం తగ్గుతుంది. దీని  ఆకులను జిడ్డుగా ఉన్న పలకపైన రుద్దితే పలకకి ఉన్న జుట్టు పోయి కొత్త దానిలా మెరుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆరోగ్య కరమైన విషయాలను తెలుసుకోవడానికి మా పేజీ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి

గమనిక : ఈ వెబ్ సైట్ లో  పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు

Leave a Comment

error: Content is protected !!