ఆగస్టు ఎనిమిది ఆదివారం రోజు అమావాస్య వస్తుంది. ఆ రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఇలా పాటించడం వలన పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోవడంతో పాటు వాళ్ళ జీవితంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతాయి. ఈ ఆదివారం వచ్చే అమావాస్య ఎంతో ప్రాముఖ్యమైనదని పండితులు చెబుతున్నారు. ఆరోజు వందేళ్లకు ఒకసారి వచ్చే అమావాస్య రోజు పుష్యమి నక్షత్రం కూడా కలుస్తుంది. పుష్యమి నక్షత్రం అమావాస్య రోజున రావడం వలన విశేషం ఏమిటి అనుకుంటున్నారా?
పుష్యమి నక్షత్రం రోజున రవి గురువుల కలయిక జరుగుతుంది. ఇలా కేవలం వందేళ్లకు ఒకసారి మాత్రమే రవి, గురువుల కలయిక పుష్యమి నక్షత్రం రోజున జరుగుతుందట. ఆదివారం అమావాస్య రావడం సంవత్సరంలో నాలుగైదు సార్లు జరుగుతుంది. ఇలా వచ్చిన ప్రతిసారి చాలామంది పిల్లలకు దిష్టి తీస్తుంటారు. ఇలా చేయడం వలన వారిపై ఉన్న నరదృష్టి, చెడు శక్తులు పోయి ఆరోగ్యం, అభివృద్ధి జరుగుతుంది.
దాని కోసం మనం ఆదివారం, అమావాస్య రోజు పిల్లలకు మీరు ఏ పద్ధతిలో దిష్టి తీస్తారో అలా దిష్టి తీయాలి. కొంతమంది కొబ్బరికాయతో, కొంతమంది ఎర్ర నీళ్లతో, కోడిగుడ్డుతో కూడా తీస్తుంటారు. మీరు ఏ పద్ధతిలో అయితే అనుసరిస్తుంటారో అలా చేసి తరువాత దిష్టి తీసిన వారు తీసుకున్న వారు ఇద్దరు తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవాలి. దేవుడు ముందు ఒక రావి ఆకుకి పసుపు కుంకుమ పెట్టి దానిలో ఒక ప్రమిద పెట్టి ఆవు నెయ్యి వేసి దీపం పెట్టాలి. ఒక వత్తితో ఎప్పుడూ దీపం పెట్టకూడదు.
రెండు వత్తులు లేదా మూడు వత్తులు కలిపి దీపం పెట్టాలి. తర్వాత దేవుడికి నమస్కరించి ఎటువంటి చీడపీడలు మాపై ఉండకుండా కాపాడమని భగవంతుని కోరుకోవాలి. ఇలా ఎంత మంది కొడుకులు ఉంటే అంత మంది చేత దీపాలు పెట్టించాలి. ఆదివారం అమావాస్య రోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతారు. ఆరోజు మార్వాడీలు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అందుకే ఆ రోజు ఇంటిని శుభ్రంగా పెట్టుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఇలా పూజ చేయడం వలన నరదృష్టి, చెడు చూపు మీపై నుండి పోవడంతో పాటు ధన లాభం కూడా జరుగుతుంది.
కిడ్నీ సమస్యల గురించి మరియు మూత్రంలో ప్రోటీన్ లాస్ ఉన్న జబ్బుకు ఏ విధంగా మందులు వాడాలి. క్రియేటింగ్ తగ్గించుకోవడానికి మరియు . జబ్బు నయం చేసుకోవడానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పగలరు