ఫంక్షన్ కి పార్టీ కి నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన చర్మం తెల్లగా, కాంతివంతంగా కనిపిస్తుంది. మీరు గంటల కొద్ది పార్లర్ లో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముఖం పై నల్లని మచ్చలు, టాన్ పోగొట్టి, చర్మాన్ని టైట్ గా చేసి ముడతలు లేకుండా చేస్తుంది. ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చలి కాలంలో మన చర్మం పొడిబారకుండా, కాంతి వంతంగా తయారవుతుంది.
ఈ ప్యాక్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్ లో రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు చర్మం తెల్లగా చేయడమే కాకుండా చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మలినాలను తొలగించి, డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ చేస్తుంది. ఈ పెరుగులో ఒక స్పూన్ మిల్క్ పౌడర్ ని ఆడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ లో ఉండే ఎంజైమ్స్ చర్మకాంతిని మెరుగుపరుస్తాయి.
తర్వాత దీనికి కావలసిన పదార్ధం తేనె. తేనె 2 లేదా 3 చుక్కలు కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ బాగా కలిసేలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. తేనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి తాజాగా, కాంతివంతంగా మారుస్తుంది. ఇప్పుడు ప్యాక్ రెడీ అయింది కదా! దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు లేదా ఉదయాన్నే చర్మాన్ని శుభ్రంగా కనుక్కోవాలి. తర్వాత ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి.
అప్లై చేసి 20 నుంచి 25నిమిషాల వరకు ఆరనివ్వాలి. తర్వాత చర్మాన్ని గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. తర్వాత మీ చర్మంలో వచ్చే తేడా మీరే గమనిస్తారు. చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్, మలినాలు పోయి చర్మం శుభ్రపడుతుంది. చర్మాన్ని డీప్‌గా క్లీన్ చేస్తుంది. చర్మం పొడిబారకుండా, మాయిశ్చరైజ్ చేస్తుంది. శుభ్రంగా కడిగిన తర్వాత చర్మానికి ఏదైనా మాయిశ్చరైజర్ లేదా బాడీ బటర్ అప్లై చేసుకోవాలి.
చర్మానికి మాయిశ్చరైజర్ అనేది చాలా అవసరం. ఈ విషయం చాలామందికి తెలియదు. చర్మం మాయిశ్చరైజ్ చేయకుండా నెగ్లెట్ చేస్తారు. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం వల్ల చర్మం రఫ్‌గా ఉండకుండా సాఫ్ట్ గా ఉంటుంది. చర్మం పై ముడతలు, యాంటీ ఏజింగ్ లక్షణాలను కనపడకుండా చేస్తుంది. చర్మాన్ని పొల్యూషన్ నుండి కాపాడుతుంది. సింపుల్ ప్యాక్ తో ఇంట్లోనే పార్లర్ లాంటి కాంతివంతమైన మనం సొంతం చేసుకోవచ్చు.