వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. కానీ ఉదయం కుదరకపోతే చేయడం మానేస్తారు. ఉదయం మాత్రమే కాకుండా రాత్రి భోజనం తర్వాత కూడా వాకింగ్ చేయొచ్చు. ఉదయం చేయడానికి చాలా ఆసనాలు, వ్యాయామాలు ఉంటాయి. ఈ ఆసనాలు, వ్యాయామాలు రాత్రి భోజనం తర్వాత చేయలేము. వాకింగ్ అయితే ఈజీగా చేయొచ్చు.
వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జీర్ణక్రియ యాక్టివ్ గా పనిచేస్తుంది. వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ప్రతి అవయవానికి ప్రాణవాయువు అందుతుంది. దీని వల్ల ప్రతి అవయవం యాక్టివ్ గా పనిచేస్తాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత మీకు నచ్చినట్లు అంటే స్పీడుగా లేదా స్లో గా లేదా మీడియంగా చేయొచ్చు. రాత్రి భోజనం తర్వాత అరగంట నడవడం వలన 200 కేలరీలు నుండి 300 కేలరీలు ఖర్చవుతాయి.
మీ శరీరంలో 200 నుంచి 300 కేలరీలు ఖర్చయ్యాయి అంటే కొవ్వుగా మారే ప్రక్రియ ఆగింది అని అర్థం. శరీరంలో కొవ్వు తయారయ్యే ప్రక్రియ రాత్రి భోజనం తర్వాత జరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేయడం వలన ఈ పక్రియ జరగకుండా ఆపవచ్చు. 7:00 కి తినేసి ఒక గంట వాకింగ్ చేసినట్లయితే రక్తంలోకి వెళ్లే షుగర్ లెవెల్స్, కొవ్వును తగ్గించవచ్చు. రాత్రి వాకింగ్ వలన బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
7 గంటల లోపు తినేసి పడుకునే లోపు అరగంట నుంచి గంట వరకు వాకింగ్ చేసినట్లయితే 300 క్యాలరీలు ఖర్చయ్యి శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతాయి. తిన్న తర్వాత వాకింగ్ చేసి స్నానం చేసి పడుకోవాలి. దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఆపొచ్చు. రాత్రి తిన్న తర్వాత వాకింగ్ చేయడం వలన గురక రాదు. తిన్న వెంటనే పడుకోవడం వలన పొట్ట మొత్తం ప్రెషర్ లంగ్స్ మీద పడుతుంది.
దీనివలన ప్రాణవాయువు ఊపిరితిత్తులకు చేరదు దానివలన గురక వస్తుంది. త్వరగా తినడం వలన పొట్ట వెళ్లి లంగ్స్ మీద ఒత్తిడి పడదు.ఎక్కువ ప్రాణవాయువును తీసుకోగలుగుతాము. గురక శబ్దం తగ్గుతుంది. వాకింగ్ చేసి స్నానం చేసి పడుకోవడం వలన శరీరం అలసిపోయి ఉంటుంది కాబట్టి బాగా నిద్ర పడుతుంది. రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తే బొజ్జ రాకుండా ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి పనులలో అలా కూర్చుని ఉండటం వలన కండరాలు పట్టేసినట్లు అవుతాయి.
రాత్రి వాకింగ్ చేయడం వల్ల కండరాలన్నీ ఫ్రీ అయ్యి ఉత్తేజమవుతాయి. ఉద్యోగం, వ్యాపారం చేసుకునే వారికి రక్తం కాళ్లలో నిల్వ ఉంటుంది. దీనివలన రక్త సరఫరా నిలిచిపోతుంది. వాకింగ్ చేయడంవల్ల ఇవన్నీ క్లియర్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒక పూట వ్యాయామం కంటే రెండు పూటలా వ్యాయామం చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తర్వాత వాకింగ్ ఎప్పుడు రౌండ్గా కాకుండా స్ట్రెయిట్గా చేయాలి.