avoid these habits to overcome intestinal problems

ఈ పదిలో మీకు ఏ అలవాట్లు ఉన్నా పేగులు చిల్లుపడి రక్తం కారడం ఖాయం……… హెల్తీ పేగుల కోసం ఒకసారి ఇది తెలుసుకోండి……

మనం తీసుకున్న ఆహార పదార్థాలు కానీ లేదా ఏదైనా ద్రవ పదార్థాలు గానీ పొట్ట లోపలికి వెళ్ళిన తర్వాత రక్తంలోకి వెళ్తాయి. ఆహారం ద్వారా క్రిములు పొట్టలోంచి రక్తంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ నోట్లో రక్షణ వ్యవస్థ, పొట్టలో రక్షణ వ్యవస్థ బాగా పని చేస్తే కనుక ఆ క్రిములు లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. మనం నమలటం లేదు కాబట్టి నోట్లోంచి మిస్ అయ్యి పొట్టులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. పొట్టలో హానికరమైన కెమికల్స్ తొలగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, కొన్ని రకాల హెల్ప్ ఫుల్ బాక్టీరియాలు ఉంటాయి.

                           ఇలాంటివి కూడా మన రక్షణ వ్యవస్థను చాలా వరకు యాక్టివ్ చేస్తాయి. పేగులలో అనేక లాభాలు కలిగించే ఫ్రెండ్లీ బాక్టీరియాలు ఈమధ్య చాలా తగ్గిపోతున్నాయి. హాని కలిగించే బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగిపోతున్నాయి. మనం ఇది రివర్స్ చేసుకోవాలి. దీనికి ఏం చేస్తే, ఏ అలవాట్లు మార్చుకుంటే బాగుంటుంది అంటే ముందుగా 1.ఆల్కహాల్ తాగడం, 2. నిద్ర సరిగా పోకపోవడం, 3. ఒత్తిడి మరియు ఆత్రుత, 4. స్మోకింగ్, 5. ఎసిడిక్ ఫుడ్స్ అంటే కూల్ డ్రింక్స్, పంచదార కొన్ని ఇటువంటి ఆహార పదార్థాలు ఇందులో ఉండే ఎసిడిక్ కంటెంట్ కి బ్యాక్టీరియాలు అన్ని చనిపోతాయి.

                     6. ఫ్రోజిన్ చేసినవి అంటే ఫ్రిజ్లో ఉండే చల్లటి పదార్థాలు ఐస్ క్రీమ్లు అటువంటివి. ఇవన్నీ పేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని ఎఫెక్ట్ చేస్తాయి. 7. యాంటీబయోటిక్స్ వాడకం. కొన్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పవర్ఫుల్ మెడిసిన్స్ వాడతాం. అప్పుడు ఇలాంటివి బాగా చనిపోతాయి. 8. ఫైబర్ ఫుడ్ తినకపోవడం. 9. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, డిసీజ్ వచ్చినప్పుడు, 10. పదార్థాలు తయారు చేసేటప్పుడు లేదా పెంచేటప్పుడు వేసే ఎరువులు, పెస్టిసైడ్స్, పండడానికి వేసే కార్బైడ్లు, కెమికల్ తో ఉన్న ఫుడ్ ఐటమ్స్. మనకు పేగులలో రక్షణ వ్యవస్థ హెల్తీగా ఉండాలి అంటే ప్రధానంగా పేగులు హెల్తీ బ్యాక్టీరియాతో ఉండాలి.

                          కనుక ఇలాంటి మంచి బ్యాక్టీరియా పెరగాలి అంటే మన అలవాట్లు, జీవన శైలి మార్చుకోవడం, పుల్లటి మజ్జిగ, పుల్లకి పెరుగు వాడడం వలన హెల్తీ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. మాగిన అరటిపండు, సోయాబీన్ వంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది…

Leave a Comment

error: Content is protected !!