Ayurvedic Benefits of Dry Ginger

శొంఠి గూర్చి తెలియకపోతే వొట్టి శుంఠలనే అర్థం. తెలియకపోతే ఇది చదవండి మరి.

శొంఠి రుచికరమైనది, ఆకలి లేదని భాధపడేవారికి శొంఠి దివ్యౌషదం. కఫాన్ని నివారించి, వాంతుల్ని తగ్గించి, గొంతును శుభ్రం చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. 

ఇంతకు శొంఠి అంటే ఏమిటి అనే అనుమానం, అది ఎలా తయారవుతుంది అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అల్లాన్ని పాలల్లో ఉడికించి, ఎండబెడితే శొంఠి అవుతుంది.  అయితే అల్లానికి ఉన్న గుణాలు శొంఠి లో ఉండే గుణాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే పాలలో ఉడకడం వలన. ఇలాంటి శొంఠి తో అద్భుతమైన చిట్కాలు ఒకసారి తెల్సుకుందాం చదవండి మరి.

శొంఠి తో భేషైన చిట్కాలు:

◆ బోదకాళ్లు, వాత వ్యాధులన్నింటిలో, మొలలు, కడుపు ఉబ్బరం, పైత్యం, కాలేయ సంబంధిత జబ్బులలో శొంఠిని వాడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

◆ కడుపునొప్పి, దగ్గు, ఆయాసం, గుండె జబ్బులు, ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నపుడు అల్లం కంటే శొంఠి వాడటం శ్రేష్టం.

◆ జిగురు విరేచనాలు అవుతున్న సమయంలో, పేగుల లోపల మ్యుకస్ పొర ఈ విరేచనం ద్వారా బయటకు వస్తుంది. దీన్నే జిగురు పడటం అంటారు, ఇలాంటి సమయంలో శొంఠిని ఆహారంలో భాగం చేసుకుంటే జిగురు విరేచనాలు తగ్గిపోతాయి.

◆ నీళ్ల విరేచనాలు మరియు కడుపులో మంట వల్ల కలిగే విరేచనాలకు కూడా శొంఠి ఉత్తమంగా ఉపయోగపడుతుంది.

◆ శొంఠి, పంచదార, ఆముదం పప్పు, మూడింటిని సమానంగా కలిపి కొంత మోతాదు తీసుకుంటే విరేచనం సాఫీగా అవుతుంది మరియు కీళ్లనొప్పులు తగ్గుతాయి.

◆ శొంఠి, కరక్కాయ, వాము కలిపి బెల్లంతో నూరి తింటే కీళ్ళ వొతం తగ్గిపోతుంది.

◆ విపరీతమైన తలనొప్పి వేదిస్తుంటే కొద్దిగా కాచినపాలలో శొంఠి వేసి మెత్తగా నూరి రెండు లేక మూడు చుక్కలు ముక్కుల్లో వేస్తే తలనొప్పి తగ్గుతుంది.

◆ నల్లజీలకర్ర, శొంఠి, వస 5 భాగాలు, రెండు బాగా కలిపి పొడి చేసుకొని తేనె లో కలిపి కుంకుడుకాయ అంత పరిమాణంలో తీసుకుంటే పక్షవాతం నుండి నెమ్మదిగా కోలుకుంటారు.

◆ 200గ్రాముల నెయ్యిలో అంతే సమానంగా శొంఠి పొడి కలిపి దానికి అంతే బాగంలో వెల్లుల్లి కలిపి బాగా నూరి చిన్న మాత్రలు గా చేసుకొని జీర్ణశక్తి ని బట్టి రోజూ రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే ముఖానికి వచ్ఛిన పక్షవాతం, కాళ్ళు చచ్చుబడిపోవడం, దవడ బిగుసుకుపోవడం, కీళ్ళనొప్పులు, కాళ్ళు, చేతులు పీకడం వంటి సమస్యలు అన్ని ఉపశమిస్తాయి.

◆ శొంఠి కలిపిన మారేడుకాయ గుజ్జును నీళ్ళలో మరిగించి తాగితే రక్తవిరేచనాలు, కలరా తగ్గుతాయి, శొంఠి మంచిది కాదని చాలామంది అభిప్రాయం. అయితే శొంఠని వేయించి దంచి వాడుకోవాలి.

చివరగా……..

అందరికీ విరివిగా అందుబాటులో దొరికే శొంఠి పైన చెప్పుకున్న విధంగా అవసరమైనప్పుడు వాడుకుంటే ఎంతో ప్రమాధమనిపించే సమస్యలు కూడా సులువుగా నయమవుతాయి.

Leave a Comment

error: Content is protected !!