ముఖంపై మంగు మచ్చలు లేదా నల్ల మచ్చలు వచ్చినప్పుడు ముఖం చూడడానికి అంత బాగుండదు. అలా మచ్చలు వచ్చిన వారు వాటితో చాలా ఇబ్బంది పడుతుంటారు. వీటిని నివారించడానికి అనేక రకాలు చిట్కాలు ప్రయత్నించి విఫలం అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా వాడి చూడండి.
100% ప్రయోజనం ఉంటుంది. దీని కోసం మనం కానుగ నూనె తీసుకోవాలి. దీనిని కరంజీ ఆయిల్ అని కూడా అంటారు. మనకు రోడ్డు పక్కన కనిపించే కానుగ చెట్ల యొక్క గింజల నుండి తీసిన ఈ నూనె కొంచెం దుర్వాసన వస్తుంది. కానీ మంగు మచ్చలు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.
ఇందులో మంచి నాణ్యమైన నూనెను తీసుకొని ఒక స్పూన్ నూనెను ఒక గిన్నెలో వేసుకోవాలి. దానిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసుకోవాలి. తాజాగా చెట్టు నుండి తీసినదైతే అలోవెరా జెల్ శుభ్రంగా కడిగి వాడుకోవాలి. లేదా మార్కెట్లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్ రంగులు వేయకుండా ఉండేది వాడుకోవచ్చు.
తరువాత అలోవెరా జెల్, కానుగ నూనెను బాగా కలపాలి. ఇవి రెండు కలవడానికి చాలా సమయం పడుతుంది. ఇవి బాగా కలిపిన తరువాత మంచి క్రీమ్లా మారిన తరువాత ఎక్కడైతే ఈ మంగు మచ్చలు ఉన్నాయో అక్కడ అప్లై చేయాలి. ముఖమంతా అప్లై చేసినా ఎటువంటి నష్టం ఉండదు. దీనిని ఎక్కువ సేపు మీ ముఖంపై ఉంచుకుంటే మంచిది.
వీలైతే రాత్రిపూట అప్లై చేసుకొని ఉదయం వరకు వదిలేయాలి లేదా పగలు రెండు మూడు గంటల తరువాత నీటితో శుభ్రం చేసుకోవచ్చు. దీని తరువాత ముఖానికి అప్లై చేయడానికి ప్యాక్ గురించి తెలుసుకుందాం. ఒక గిన్నెలో ఒక స్పూను అలోవెరా జెల్ తీసుకోవాలి. దానిలో ఒక్క పావు అశ్వగంధ పౌడర్ ఒక పావు స్పూన్ అతి మధురం పౌడర్, పావు స్పూన్ కస్తూరి పసుపు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి.
ఈ మిశ్రమం ముఖానికి అప్లై చేసిన తర్వాత ఆరేంత వరకు వదిలేయాలి. ఇది ముఖంపై టైట్ గా అవుతుంది. ముఖం పై ముడతలు, పిగ్మెంటేషన్ తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీనిని కొద్దిగా నీటిని తడిచేసి నెమ్మదిగా మసాజ్ చేస్తూ రిమూవ్ చేయాలి. ఈ ప్యాక్ ను వారంలో కనీసం రెండు సార్లు వాడడం వలన పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు వంటివి తగ్గించుకోవడం వల్ల చాలా బాగా సహాయపడుతాయి.