హలో ఫ్రెండ్స్ .. ఈ తలనొప్పి చాలా సాధారణమైన సమస్య అయినప్పటికీ ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న అతి ముఖ్యమైన సమస్య. తలనొప్పి రావడానికి ముఖ్యమైన కారణం సరిగా నిద్ర లేకపోవడం, ఎక్కువగా శబ్దం, కాలుష్యం ఎక్కువైనా లేదా ఏదైనా అనారోగ్యం వచ్చినా ఒంట్లో కొద్దిగా నలతగా ఉన్నా ఈ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.
తలనొప్పి రాగానే మనం వెంటనే చేసే పని టాబ్లెట్ వేసుకోవడం. దీనివలన మీకు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుందేమో ఏమోకానీ భవిష్యత్తులో మీ శరీరంలో ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మన శరీరానికి మనం మందులు అలవాటు చేస్తే భవిష్యత్తులో ఈ చిన్న చిన్న రోగాలు కూడా మందులకు లొంగకుండా పెద్దగా అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు చెప్పబోయే ఒక సింపుల్ ఆయుర్వేదిక్ టిప్ గనుక మీరు ఫాలో అయితే మీ తలనొప్పి నుంచి మీకు ఉపశమనం కలగడానికి మాత్రమే కాదు మీ శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే శాశ్వతంగా ఇలాంటి నొప్పి రాకుండా చేస్తుంది.
ఆయుర్వేదిక్ హోమ్ రెమిడీ తయారీ విధానం
- ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరస్పూను మోతాదులో ఆవుని తీసుకోండి.
- ఇప్పుడు ఇందులో ఒక పావు చెంచా లేదా చిటికెడు సున్నం కలపాలి.
- రెండింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోండి
ఈ రెమిడీ ని ఎలా వాడాలి
మీకు తల నొప్పిగా అనిపించినప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని మీకు తలనొప్పి కలిగించే ఉన్న ప్రదేశంలో లేదా మీ ముదురు కనతలపైన ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని అప్లై చేసి ఒక రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే కేవలం ఐదు నుండి పది నిమిషాల లోపు మీ తలనొప్పి తాగటాన్ని మీరే చూస్తారు.
ఒకవేళ మీ తల నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పది నుండి పదిహేను నిమిషాలు అలాగే ఉంచితే మంచి రిజల్ట్స్ చూస్తారు.
ఈ మిశ్రమాన్ని రాసుకోవడం వలన మీ స్ట్రెస్ ఒత్తిడి కూడా దూరమై పోయి మీకు ఆయిగా నిద్ర కూడా పడుతుంది. ఈ రెండిటి ఉపయోగించడం మూలంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు.
ఆవు నెయ్యి మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. మన నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను వేగవంతం చేసి మైగ్రేన్ సైనస్ వంటి తలనొప్పి సమస్యలను నిమిషాలలో మాయం చేసే గుణం ఆవు నెయ్యి కి ఉంది.
తడిసున్నం లో కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది పుష్కలంగా ఉంటుంది ఇది మన తల నొప్పిని తగ్గించడానికి ఒక దివ్యౌషధమని చెప్పుకోవచ్చు
మీకు తలనొప్పి అనిపించిన వెంటనే కుర్చీలో కూర్చొని పాదాలను వేడినీటిని నింపిన బకెట్లో లేదా టబ్ లో ఉంచుకోండి. నిద్రకు ముందు కనీసం పావుగంట పాటు ఇలా చేస్తూ ఉంటే మీకు దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పి, సైనస్ మైగ్రేన్ వల్ల వచ్చే తలనొప్పి కూడా తగ్గుతుంది. తరచుగా తలనొప్పి వచ్చే వారు క్యాబేజ్ కాలిఫ్లవర్ మెంతికూర ముఖ్యంగా ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మీకు తలనొప్పి ఎక్కువగా రాకుండా ఉంటుంది.