ayurvedic home remedies for deep sleep

మంచి గాఢ నిద్ర పట్టాలంటే ఇది ఒక్కటి చాలు

చాలా మంది సరైన నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది పడుకోగానే నిద్ర పోతుంటే మీరు మాత్రం నిద్ర లేక రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందా అన్నట్టు చూస్తూ ఉంటారు. నిద్ర లేక పోవడం ఇబ్బంది మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలకు కూడా కారణంగా ఉంటుంది. కంటినిండా నిద్ర పోవడం వలన ఒంటినిండా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇలా నిద్ర లేని వారు ఏం చేస్తే మంచి నిద్ర పడుతుంది అంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటించడం వలన మంచి గాఢమైన నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాడ నిద్ర పట్టాలి అనుకునేవారు ఈ చిట్కా తప్పకుండా పాటించండి.

 దాని కోసం మనం తీసుకోవలసిన పదార్ధాలు జటామాంసి. జటామాంసీ అంటే ఆయుర్వేద ఔషధాల్లో ఇది కూడా ఒకటి. జటామాంసి సంవత్సరమంతా ఆయుర్వేద షాపుల్లో అందుబాటులో ఉంటుంది. ఇది వేరు రూపంలో మరియు చూర్ణం రూపంలో కూడా లభిస్తుంది. తర్వాత పదార్థం గసగసాలు మసాలా దినుసుగా ఉపయోగించి ఈ గసగసాలు మంచి నిద్రతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. తర్వాత పదార్థం తాటి కలకండ కూడా ఆయుర్వేద షాపుల్లో అందుబాటులో ఉంటుంది. 

ఈ ఔషధం  తయారు చేయడానికి 50 ml పాలు, 200 ml నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే పద్ధతి ప్రతిరోజు రాత్రి రెండు వందల ఎనభై ఒకటి లేదా రెండు గ్రాముల జటామాంసి, ఒక స్పూన్ గసగసాలు, తాటి కలకండ లేదా పటికబెల్లం కూడా ఉపయోగించవచ్చు. తాటి కలకండ ఒక స్పూన్ వేసుకోవాలి. తాటి కలకండ అందుబాటులో లేనప్పుడు పటిక బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీటిని 100 ml వరకు బాగా మరిగించాలి. ఈ కషాయం తయారైన తరువాత దీనిలో 50ml గోరువెచ్చని పాలను కలపాలి. 

ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగడం వల్ల మెదడులో నిద్రకు కావలసిన హార్మోన్ విడుదలై మంచి నిద్ర పడుతుంది. ఇలా కొన్ని రోజుల పాటు వాడిన తరువాత ఔషధం తాగడం మానేయవచ్చు. ఈ ఔషధం చాలా పవర్ఫుల్ కనుక చాలా రోజుల వరకు ప్రభావం మనపై ఉంటుంది. ఈ ఔషధం మానేసిన కూడా నిద్ర పట్టడం అలవాటైపోతుంది.

Leave a Comment

error: Content is protected !!